కడప : జిల్లాలో సోమవారం నుండి విద్యుత్ కోతలు విధించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు పరిశ్రమలకు మాత్రమే కరెంట్ కోతను అమలు చేస్తున్నారు. అయితే వేసవి కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇక గృహావసరాలకు కూడా పవర్ కట్ ను వర్తింపచేయలాని నిర్ణయించారు. నగరంలో ఉదయం 8 నుండి 9 వరకు మున్సిపాల్టీల్లో ఉదయం 11 నుండి 1 గంట వరకు కోత విధిస్తారు. అన్ని మండల కేంద్రాల్లో 1 నుండి 3 గంటల వరకు కోత విధిస్తారు.