TeluguPeople
  are the trend-setters
 
Astrology: Weekly and Yearly Predictions by Sign

March 2009 - March 2010 rASi falAlu

కుంభం (ధనిష్ఠ 3, 4పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3పా) ఆదాయం - 8, వ్యయం - 8, రాజపూజ్యం - 3, అవమానం 5 ఈ రాశి వారికి గురుడు మే 1 వరకు వ్యయస్థానమైన మకరం, తదుపరి జన్మరాశి కుంభంలోనూ తిరిగి జూలై 3 నుండి డిసెంబర్ 19 వరకు వక్రగతిన మకరం, అనంతరం కుంభరాశి యందు సంచారం. శని సెప్టెంబర్ 9 వరకు సప్తమ స్థానమైన సింహం, తదుపరి అష్టమ స్థానం కన్యారాశి యందు సంచారం. రాహు, కేతువులు నవంబర్ 19 వరకు వ్యయస్థానం మకరం, షష్టమ స్థానం కర్కాటకం, తదుపరి లాభస్థానం ధనుస్సు, పంచమస్థానం మిధునంలోనూ సంచారం. ఈ రాశి వారికి అంతగా అనుకూలించదు. ఆర్థికంగా అంత ఆశాజనకంగా ఉండదు. బాధ్యతలు, శ్రమ పెరుగుతాయి. వ్యవహారాలు కాస్త నత్తనడకన సాగుతాయి. మీ అంచనాలు, ఊహలు తప్పుతాయి. కొందరి వైఖరి వల్ల మీ గౌరవానికి భంగం వాటిల్లుతుంది. బంధు, మిత్రులతో అకారణ విరోధాలు. తరచూ ప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కళ్ళు, కీళ్ళ సంబంధ వ్యాధులు బాధిస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు చేజారతాయి. కళాకారులకు కొన్ని అవకాశాలు శ్రమానంతరం దక్కుతాయి. విద్యార్థులకు ఫలితాలు నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులు సంవత్సరం మధ్యలో ఉద్యోగావకాశాలు పొందుతారు. సాంకేతిక, పరిశోధన, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలలో జాప్యం ఏర్పడుతుంది. వీరు శని, రాహు, కేతువులకు జపాలు, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది. అదృష్ట సంఖ్య 8 అనుకూల సంఖ్యలు 4, 5, 9 వీరు నీలం ధరించాలి. చైత్రం : పనులలో జాప్యం, బంధువులతో తగాదాలు, వృధా ఖర్చులు, కుటుంబంలో చికాకులు, ఆరోగ్యభంగం. వైశాఖం : వ్యాపారాలలో స్వల్ప లాభాలు, ఉద్యోగాలలో స్థిరత్వం, వ్యవహారాలలో విజయం, ప్రయాణాలు, దైవదర్శనాలు. జ్యేష్టం : వ్యాపారాలు నిలకడగా సాగుతాయి, శ్రమాధికం, పనులు వాయిదా, ఆర్థిక ఇబ్బందులు, రుణ వత్తిడులు, తీర్థయాత్రలు. ఆషాఢం : ఆర్థికాభివృద్ధి, శుభకార్యాలలో పాల్గొంటారు, వాహనయోగం, ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. శ్రావణం : వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి, బంధువులతో తగాదాలు, కొత్త రుణ యత్నాలు, దూర ప్రయాణాలు, అనారోగ్యం. భాద్రపదం : ఆరోగ్య, కుటుంబ సమస్యలు, భూ వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు, దూరప్రయాణాలు, ఆలయదర్శనాలు. ఆశ్వయుజం : ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి, ఆర్థికాభివృద్ధి, సంఘంలో గౌరవ మర్యాదలు, బంధువులతో సఖ్యత. కార్తీకం : వ్యాపారాలు మందగిస్తాయి, అనుకోని ఖర్చులు, ప్రయాణాలలో ఆటంకాలు, బంధు, మిత్రులతో విరోధాలు, శ్రమాధికం. మార్గశిరం : వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ప్రయత్నాలు అనుకూలిస్తాయి, ఆర్థిక ఇబ్బందులు, రుణాలు, చేయాల్సి వస్తుంది. పుష్యం : శ్రమానంతరం పనులు పూర్తి, సోదరులు, మిత్రులతో తగాదాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి, అనారోగ్యం. మాఘం : అన్నింటా విజయం, ఆర్థిక ప్రగతి, నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు, వ్యవహారాలలో విజయం, సంఘంలో గౌరవం. ఫాల్గుణం : వ్యవహారాలలో విజయం, ఆర్థికాభివృద్ధి, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, కాంట్రాక్టులు లభిస్తాయి, శ్రమకు ఫలితం దక్కుతుంది.

Subham&astu


mI rASiphalAlu telusukunEMduku

mI rASi gurtupei klik` chEyaMDi


Aries Taurus Gemini Cancer Leo Virgo
Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces




News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training