TeluguPeople
  are the trend-setters
 
Astrology: Weekly and Yearly Predictions by Sign

March 2009 - March 2010 rASi falAlu

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా) ఆదాయం - 2, వ్యయం - 8, రాజపూజ్యం - 1, అవమానం - 7 ఈ రాశి వారికి గురుడు 1-5-2009 వరకు దశమ స్థానమైన మకరంలోనూ, తదుపరి లాభస్థానమైన కుంభంలోనూ, తిరిగి 30-7-2009 నుండి మకరరాశి యందు సంచారం. తిరిగి 19-12-2009 నుండి కుంభరాశి యందు సంచారం. శని 9-9-2009 వరకు పంచమస్థానమైన సింహం, తదుపరి షష్ఠమ స్థానమైన కన్యారాశి యందు సంచరిస్తాడు. రాహు, కేతువులు 19-11-2009 వరకు దశమ స్థానమైన మకరం, చతుర్ధ స్థానమైన కర్కాటకం, తదుపరి భాగ్యస్థానమైన ధనుస్సు, తృతీయ స్థానం మిధున రాశి యందు సంచారం. ఈ ఏడాది విరికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. గృహనిర్మాణాలు చేపడతారు. దూరమైన బంధువులు, ఆప్తులు దగ్గరవుతారు. ఆర్థికంగా బలపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు పొంది అవార్డులు, రివార్డులు అందుకుంటారు. కుటుంబసౌఖ్యం. అవివాహితులకు వివాహయోగం. ఆభరణాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టుదారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ఐ.టి, సినీ పరిశ్రమ వారికి నూతనోత్సాహం కలుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. వ్యాపార, వాణిజ్య రంగాల వారికి అభివృద్ధి దాయకంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వారికి అత్యంత లాభసాటిగా ఉంటుంది. రాజకీయం రంగంలోని వారికి ప్రజాదరణ లభిస్తుంది. పదవీ యోగాలుంటాయి. వైద్య, న్యాయవాద వృత్తుల వారికి గతంలోని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. రియల్ ఎస్టేట్ల వారికి వ్యాపారాలు పుంజుకుంటాయి. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు నూతన సంవత్సరం మొత్తం అనుకూలం. విష్ణుసహస్ర నామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయించుకోవడం మంచిది. అదృష్ట సంఖ్య 9 అనుకూల సంఖ్యలు 1, 2, 3 వీరు పగడం ధరించవచ్చు. చైత్రం : ఆరోగ్యం, ఋణ విముక్తి, ఆకస్మిక ప్రయాణాలు, శుభకార్య ప్రయత్నాలు. వైశాఖం : వ్యాపార వృద్ధి, కొత్త మిత్రుల పరిచయం, గృహనిర్మాణ యత్నాలు, ఉద్యోగ సిద్ధి. జ్యేష్ఠం : అధిక శ్రమ, అనారోగ్యం, వ్యాపారాలలో సామాన్యం, ఉద్యోగ మార్పులు, బంధువులతో వైరం. ఆషాఢం : శుభకార్యాల ప్రస్తావన, వస్తు, వాహన లాభాలు, ప్రముఖులతో పరిచయాలు, స్థిరాస్తి వృద్ధి. శ్రావణం : పనులలో జాప్యం, ధనవ్యయం, కుటుంబంలో చికాకులు, స్త్రీ సహకారం. భాద్రపదం : వ్యాపారాలలో జాగ్రత్త అవసరం, బంధు, మిత్రులతో కలహాలు, వృధాఖర్చులు. ఆశ్వయుజం : నరాలు, పైత్య సంబంధ వ్యాధులు, ఔషద సేవనం, దూరప్రయాణాలు, శ్రమాధికం. కార్తీకం : స్వల్ప ధనలబ్ధి, శుభవార్తలు, వాహనయోగం, మిత్రుల కలయిక, సంతాన సౌఖ్యం. మార్గశిరం : ఆదాయానికి మించి ఖర్చులు, వివాదాలు, ఆకస్మిక ప్రయాణాలు, ఆరోగ్యభంగం. పుష్యం : అధిక శ్రమ, అనారోగ్యం, వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు దూరప్రయాణాలు, మనశ్శాంతి లోపిస్తుంది. మాఘం : ఆర్థిక ప్రగతి, కొత్త ఉద్యోగ, వ్యాపార యత్నాలు అనుకూలిస్తాయి, ఇంటా బయటా ప్రోత్సాహం. ఫాల్గుణం : విందు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి, వాహనసౌఖ్యం, ఉద్యోగాలలో అనుకూల మార్పులు, దైవదర్శనాలు.

Subham&astu


mI rASiphalAlu telusukunEMduku

mI rASi gurtupei klik` chEyaMDi


Aries Taurus Gemini Cancer Leo Virgo
Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces




News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training