TeluguPeople
  are the trend-setters
 
Astrology: Weekly and Yearly Predictions by Sign

March 2009 - March 2010 rASi falAlu

మిథునం ( మృగశిర 3, 4 పా, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా) ఆదాయం - 14, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం - 7 ఈ రాశివారికి గురుడు 1 మే 2009 వరకు అష్టమ స్థానమైన మకరరాశి యందు, తదుపరి భాగ్యస్థానమైన కుంభరాశి యందు, జూలై 30 నుండి తిరిగి వక్రగతిన అష్టమస్థానం మకరంలోనూ, డిసెంబర్ 19 నుండి భాగ్యస్థానం కుంభంలో సంచారం. శని సెప్టెంబర్ 9 వరకు తృతీయ స్థానమైన సింహరాశి యందు, తదుపరి చతుర్ధమైన కన్యారాశి యందు సంచారం. రాహు, కేతువులు నవంబర్ 19 వరకు అష్టమమైన మకరం, ద్వితీయమైన కర్కాటకంలోనూ, తదుపరి సప్తమ స్థానం ధనుస్సు, జన్మరాశి మిథునంలోనూ సంచారం. ఈ రాశి వారికి గురుబలం తక్కువ. మిగతా గ్రహాల సంచారం కూడా ఆశాజనకంగా లేనందున మిశ్రమ ఫలాలే ఉంటాయి. రాబడికి సమానంగా ఖర్చులు ఎదురవుతాయి. వివాదాలు ఒకటి పరిష్కారమైతే మరొకటి ఎదుర్కొంటారు. బంధు, మిత్రుల నుంచి వత్తిడులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు తారుమారు కాగల అవకాశాలున్నాయి. విద్యార్థులు సామాన్య ఫలితాలు సాధిస్తారు. ఉగ్యోగాలలో ప్రమోషన్లు, బదిలీలు నిరాశపరుస్తాయి. వ్యాపారులకు నిరుత్సాహమే. తరచూ దేశ సంచారం, ఆరోగ్య పరంగా ఏదో సమస్య వేధిస్తూనే ఉంటుంది. వ్యవసాయదారులకు పెట్టుబడులు సకాలంలో అందవు. సాంకేతిక, పరిశోధన, వైద్య రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. రుణ బాధలు తప్పవు. కాంట్రాక్టర్లకు ఆర్థికంగా ఇబ్బందులు అధికమవుతాయి. కళాకారులకు అంతంత మాత్రంగా ఉంటుంది, అవకాశాలు ఊరిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. హనుమాన్ ఛాలీసా, ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది. శివాలయంలో తరచూ అభిషేకాలు చేయించుకోవాలి. అదృష్ణ సంఖ్య 5 అనుకూల సంఖ్యలు 1, 6 ఈ రాశి వారు పచ్చ ధరిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి. చైత్రం : మధ్యవర్తుల వల్ల ఇక్కట్లు, వ్యవహారాలలో ఆటంకాలు, ఆకస్మిక ప్రయాణాలు, వ్యయ ప్రయాసలు. వైశాఖం : వ్యాపారాలలో స్వల్ప లాభాలు, ఉద్యోగాలలో ఉన్నత స్థితి, పనులు పూర్తి, బంధువుల కలయిక, స్థిరాస్తి వృద్ధి. జ్యేష్ఠం : అనారోగ్య సూచనలు, వివాదాలు, మానసిక అశాంతి, బంధువులతో కలహాలు, వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆషాఢం : అనుకోని ఖర్చులు, తీర్థయాత్రలు, అధిక శ్రమ, వ్యాపారాలలో నష్టాలు, మిత్రులతో తగాదాలు. శ్రావణం : వ్యాపార వృద్ధి, కొత్త సంస్థలు ప్రారంభం, ఆలోచనలు కలసివస్తాయి, శ్రమకు ఫలితం దక్కుతుంది, దైవదర్శనాలు. భాద్రపదం : ధన వస్తు లాభాలు, బంధువులతో సఖ్యత, కొత్త ఉద్యోగావకాశాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. ఆశ్వయుజం : వ్యాపారాలలో స్వల్ప ధనలబ్ధి, ప్రముఖుల నుంచి శుభ వర్తమానాలు, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి, వ్యవహారాలలో సానుకూలత. కార్తీకం : శ్రమాధికంతో పనులలో విజయం, ప్రయాణాలు, కొత్త వ్యక్తుల పరిచయం, స్వల్ప ధనలాభం. మార్గశిరం : వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. స్థిరాస్తి లాభం, బంధువైరం, బాకీలు వసూలు, ఇంటర్వ్యూలలో విజయం. పుష్యం : పనులలో అంతరాయాలు, అనుకోని ఖర్చులు, భూ వివాదాలు, ఆరోగ్యం మందగిస్తుంది, ధనవ్యయం, ఇంటాబయటా వ్యతిరేకత. మాఘం : వ్యాపారాలలో అభివృద్ధి, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం, ప్రమోషన్ అవకాశాలు, సంఘంలో గౌరవ మర్యాదలు, వాహనయోగం. ఫాల్గుణం : కార్య విజయం, సంతానసౌఖ్యం, విలువైన వస్తువులు కొంటారు, ఆప్తుల నుండి శుభవార్తలు, ఆర్థికాభివృద్ధి, భూ, గృహయోగాలు.

Subham&astu


mI rASiphalAlu telusukunEMduku

mI rASi gurtupei klik` chEyaMDi


Aries Taurus Gemini Cancer Leo Virgo
Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces




News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training