TeluguPeople
  are the trend-setters
 
Astrology: Weekly and Yearly Predictions by Sign

March 2009 - March 2010 rASi falAlu

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ) ఆదాయం - 2, వ్యయం - 8, రాజపూజ్యం - 1, అవమానం - 2 ఈ రాశివారికి గురుడు మే 1 వరకు తృతీయస్థానం మకరం తదుపరి చతుర్ధస్థానం కుంభరాశి యందు, జూలై 30 నుండి డిశెంబర్ 19 వరకు వక్రగతిన తిరిగి మకరంలోనూ, అనంతరం కుంభరాశి యందు సంచారం. శని సెప్టెంబర్ 9 వరకు దశమస్థానమైన సింహం, తదుపరి లాభస్థానమైన కన్యరాశిలోనూ సంచారం. రాహు, కేతువులు నవంబర్ 19 వరకు తృతీయమైన మకరం, నవమస్థానమైన కర్కాటకం, తదుపరి ద్వితీయమైన ధనుస్సు, అష్టమ స్థానం మిధునరాశిలో సంచరిస్తారు. ఈ రాశి వారికి గ్రహస్థితి అనుకూలం. అన్నింటా విజయాలే. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు, ఇళ్ళు కొంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ఆప్తుల నుండి శుభవార్తలు, అవివాహితులకు వివాహయోగం, వ్యాపారాలు విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు, విద్యార్ధులకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు. కళాకారులకు కొత్త అవకాశాలు, సన్మానాలు, వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు అనూహ్యంగా లాభిస్తుంది. శుభకార్యాల రీత్యా ధనవ్యయం, సాంకేతిక, పరిశోధనా రంగాల వారికి గతంలోని సమస్యలు సైతం పరిష్కారం. వీరు గణపతి అర్చనలు, శివాలయంలో అభిషేకాలు, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మంచిది. అదృష్ట సంఖ్య 9, అనుకూల సంఖ్యలు 1,2,3, పగడం ధరించాలి. చైత్రం : వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి, పనులు పూర్తి, వస్తు లాభాలు, శుభవార్తలు.. ప్రయత్నాలలో సానుకూలత. వైశాఖం : నిలకడగా వ్యాపారాలు, ధనలబ్ధి, కొత్త కార్యక్రమాలు ప్రారంభం, మిత్రుల సహకారం, దేవాలయాల సందర్శనం. జ్యేష్ఠం : వ్యాపారాలలో స్వల్ప లాభాలు. కుటుంబ సౌఖ్యం. బంధు, మిత్రులతో సయోధ్య, స్వల్ప అనారోగ్యం. ఆషాఢం : దూర ప్రయాణాలు, వృధాఖర్చులు, వృత్తి, వ్యాపారాలలో మార్పులు, అనారోగ్యం, స్థానచలనం. శ్రావణం : ధననష్టం, బంధు, మిత్రులతో వైరం, భూ వివాదాలు, ప్రయాణాలలో ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు. భాద్రపదం : వ్యాపారులలో స్వల్ప లాభాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం, పలుకుబడి పెరుగుతుంది. అశ్వయుజం : శుభవార్తలు, ఆర్థికాభివృద్ధి, వ్యాపార వృద్ధి, కుటుంబసభ్యుల ప్రోత్సాహం, ఉదర సంబంధ వ్యాధులు, వాహన యోగం. కార్తీకమాసం : ధన, వస్తులాభాలు, వ్యాపారాలలో వృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆలయ దర్శనాలు. మార్గశిరం : ధనవ్యయం, రుణాలు, పెట్టుబడులు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు, స్థానచలనం. పుష్యం : పాత బాకీలు వసూలు. ఆర్ధికాభివృద్ధి, పనులలో విజయం, ఆహ్వానాలు, ఆస్తి వివాదాలు పరిష్కారం. మాఘం : కుటుంబ సభ్యులతో విరోధాలు, ఆర్ధక ఇబ్బందులు, రుణాలు చేస్తారు. ధనవ్యయం, కొత్తమిత్రుల పరిచయం. ఫాల్గుణం : వ్యాపారాలలో అభివృద్ధి, పలుకుబడి పెరుగుతుంది. పాతమిత్రులు కలుస్తారు. అవకాశాలు దగ్గరకు వస్తాయి.

Subham&astu


mI rASiphalAlu telusukunEMduku

mI rASi gurtupei klik` chEyaMDi


Aries Taurus Gemini Cancer Leo Virgo
Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces




News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training