TeluguPeople
  are the trend-setters
 
Astrology: Weekly and Yearly Predictions by Sign

March 2009 - March 2010 rASi falAlu

కన్య (ఉత్తర 2, 3, 4పా, హస్త, చిత్త 1, 2పా) ఆదాయం - 14, వ్యయం - 11, రాజపూజ్యం - 2, అవమానం - 6 ఈ రాశి వారికి గురుడు మే 1 వరకు పంచమస్థానమైన మకరం, తదుపరి షష్ఠమమైన కుంభంలోనూ, తిరిగి జూలై 30 నుండి పంచమ స్థానం మకరం. డిసెంబర్ 19 నుండి తిరిగి కుంభరాశిలో సంచారం. శని సెప్టెంబర్ 9 వరకు వ్యయస్థానం సింహంలోనూ, తదుపరి జన్మరాశిలోనూ సంచారం. రాహు, కేతువులు నవంబర్ 19 వరకూ పంచమ స్థానం మకరం, లాభ స్థానమైన ధనుస్సులోనూ, దశమ స్థానమైన మిధునరాశి యందు సంచారం. ఈ రాశివారికి ఏల్నాటి శని ప్రభావం అధికం, ఆరోగ్యపరంగా చికాకులు, వ్యవహారాలలో చిక్కులు ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో అకారణ విరోధాలు, తరచూ ప్రయాణాలు చేస్తారు. గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశం. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా మెలగండి. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. వ్యాపారాలలో నిరాశ తప్పదు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. వ్యవసాయదారులకు అంతగా లాభించదు. కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారతాయి. విద్యార్థులకు సామాన్య ఫలితాలు. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలలోని వారికి, వైద్య వృత్తుల వారికి పరీక్షాకాలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఎటూ తేలే అవకాశం కనిపించదు. రాజకీయ నాయకులకు మిశ్రమంగా ఉంటుంది. శనికి తైలాభిషేకం, రుద్రాభిషేకం, దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించుకోవడం మంచిది. అదృష్ట సంఖ్య - 5 అనుకూల సంఖ్యలు 1, 6 వీరు పచ్చ ధరించాలి. చైత్రం : అలంకార ప్రాప్తి, కుటుంబసౌఖ్యం, విలువైన సమాచారం, బంధు, మిత్రులతో సఖ్యత, ఆర్థికాభివృద్ధి. వైశాఖం : తీర్థయాత్రలు, ప్రముఖులతో పరిచయాలు, సంఘంలో గౌరవం, బంధువులతో స్వల్ప తగాదాలు, ప్రయాణాలు. జ్యేష్ఠం : ధన, వస్తు లాభాలు, విందు, వినోదాలు, ఆలోచనలు కలసివస్తాయి, ప్రయత్నాలు ఫలిస్తాయి, స్థిరాస్తి వృద్ధి. ఆషాఢం : కుటుంబసభ్యులతో తగాదాలు, కోర్టు కేసులు చికాకు పరుస్తాయి. శ్రమాధికం, పనులలో తొందరపాటు, ధనవ్యయం. శ్రావణం : అనారోగ్యం, కుటుంబ సమస్యలు, వ్యయప్రయాసలు, మనశ్శాంతి లోపిస్తుంది, వృత్తి వ్యాపారాలలో వివాదాలు. భాద్రపదం : భూ వివాదాలు పరిష్కారం, ధన, వస్తులాభాలు, వ్యవహారాలలో అనుకూలత, శుభవార్తలు, తీర్ధయాత్రలు చేస్తారు. ఆశ్వయుజం : బంధువులతో అకారణ విరోధాలు, ధనవ్యయం, వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు, బదిలీలు, ఆరోగ్య భంగం. కార్తీకం : వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. పనులు పూర్తి చేస్తారు, ప్రముఖుల సలహాలు, సూచనలు పొందుతారు, స్థిరాస్తి వృద్ధి. మార్గశిరం : వ్యాపారాలలో మార్పులు, ధనవ్యయం, జీవిత భాగస్వామితో తగాదాలు, దూర ప్రయాణాలు, శత్రువృద్ధి. పుష్యం : కుటుంబంలో మనస్పర్థలు, వ్యవహారాలు నిరాశ పరుస్తాయి, అనారోగ్యం, ఉద్యోగ మార్పులు, పరిస్థితులు అనుకూలించవు. మాఘం : ఆర్ధికవృద్ధి, శ్రమఫలిస్తుంది, విలువైన సమాచారం, వాహనయోగం, పెట్టుబడులు అందుతాయి, స్థిరాస్తి వృద్ధి. ఫాల్గుణం : పనులు పూర్తి కాగలవు, శత్రు విజయం, సభలు, సమావేశాలలో పాల్గొంటారు, చర్చలలో పురోగతి, ఉద్యోగలాభం.

Subham&astu


mI rASiphalAlu telusukunEMduku

mI rASi gurtupei klik` chEyaMDi


Aries Taurus Gemini Cancer Leo Virgo
Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces




News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training