|
|
Articles: Drama | మానవతా మందిరం-2 - Mr. kompellaramakrishna murty
| |
(సంగీత రూపకం - రెండవ భాగం)
అందరూ: ఎందుకురా కంగారు శంకరం!
ఇక్కడనే ఉన్నాం మేమందరం.
రాణి: నువ్వింకా రాలేదని
ఎదురు చూసి, చూసి
ఆటల్లో, పాటల్లో
మునిగాం మేమందరం
అందరూ: ఎందుకురా కంగారు శంకరం!
ఇక్కడనే ఉన్నాం మేమందరం.
శంకరం: ఏం చెప్పను? గొంతు ఎలా విప్పను?
వీథుల్లో మనమెవరం తిరగరాదట!
కర్ఫ్యూ సమయాన ఇల్లు కదల రాదట!
కనిపిస్తే కాల్చివేత అంటున్నారు!
జనమంతా చెదిరి బెదిరిపోతున్నారు /ఏం చెప్పను /
రహమాన్ : ఏమిటి ఇంతటి దారుణం?
అసలేమిటి దీనికి కారణం?
కాలం ఎంతటి చెడ్డది!
బందీలుగ మనలను చేసినది! /ఏమిటి /
రాణీ: వీథుల్లోనే తిరుగకూడదా!
గడప దాటితే ముప్పు తప్పదా!
రోజీ: కాలం వేసిన సంకెళ్ళు
ఇలా మనకు ఇంకెన్నాళ్ళు?
అందరూ: కాలం ఎంతటి చెడ్డది!
బందీలుగ మనలను చేసినది!
కాలం వేసిన సంకెళ్ళు
ఇలా మనకు ఇంకెన్నాళ్ళు?
(పిల్లలచే నిందింపబడటం ఇష్టం లేక కాలం ప్రత్యక్షమయింది)
కాలం: ఎందుకు బాబూ! మీరంతా నన్ను నిందిస్తున్నారు?
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|