|
|
Articles: Short Stories | saMkraaMti kaanuka 2 - Mr. Jagannadha Rao LakshmiPrasad
| |
అత్తగారు 'మా పిపాస లేచిపోయి, కాదు, కాదు, ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇప్పటికి వారం రోజులైంది. దాన్ని వెతకడానికి మీ మామగారు వెళ్ళేరు. ఆయన రాగానే నీ కోరిక గురించి చెప్తాలే.
ఏం సత్యా! నాకో మరదలుందని మాటవరసకైనా నువ్వింతవరకూ చెప్పనేలేదే?
భలే వారండీ, పిపాస మా యింటి గేదె అండీ సత్య నవ్వుతూ అంది.
ఇంతలో బయట గేదె అరుపు వినిపించింది.అదుగో పిపాస వచ్చేసింది. సంతోషం నిండిన గొంతుకతో అరిచేడు మకరేష్.
అది పిపాస చెల్లలు ప్రియాంక అండీ అంది సత్య వాకిట్లోకి తొంగిచూస్తూ.
అలాగా సరే పద.మనం అలా గుడికివెళ్ళి పిపాస వెంటనే దొరకాలని దేవుణ్ణి ప్రార్ధిద్దాం. అప్పుడు సత్య ఇలా అనుకుంది (ఇంతసేపూ లేని దైవభక్తి ఇప్పుడెందుకు పుట్టుకొచ్చిందో? గేదె దొరికితే గానీ నీకు కానుక దొరకదనే గదా)
సరిగ్గా అలానే అనుకుంది మనసులో అత్తగారుకూడా.
మకరేష్ సత్యా గుడికి బయల్దేరారు. దారిలో...
ఎమ్మెల్యే వెనకాల గన్ మేన్ వచ్చినట్టు, స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు వెనకాల శునకం వచ్చినట్టు, ఒక కుక్క వీరి వెనకాలే వస్తోంది.
దారిలో చలి ఎంత విపరీతంగా ఉందంటే, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పాప్ నృత్యం, రాక్ నృత్యం చేసేస్తున్నారు.
వాళ్ళిద్దరూ గుడినుంచి వెనక్కి వచ్చేసరికి, ఆపాటికే పిపాసతో పాటు ఇంటికి చేరుకున్న మామగారు 'ఓం సాయి రాం ఓం సాయి రాం' అంటూ గది బయటకి రావడం, పలకరింపులూ అవీ అయిపోవడం, మకరేష్ చేతిలో ఆయనొక చెక్కు పెట్టడం క్షణాల్లో జరిగిపోయేయ్.
చెక్కుని చూసుకుని ఆశ్చర్యపోయేడు మకరేష్.
ఇదేంటి మామగారూ! బ్లాంక్ చెక్ ఇచ్చేరు? అంటే అమౌంటు నన్నే రాసుకోమంటారా? కనీసం సంతకం అయినా చేసి ఇవ్వండి.
కాదు అల్లుడూ! చెక్కులో అన్ని వివరాలూ పూర్తిగా నింపే ఇచ్చేను. అది INVISIBLE ఇంకుతో రాసేను. ఇప్పుడు నీకు అక్షరాలు కనిపించవ్. మీ ఊరికెళ్లి, ఏసీ గదిలో పెట్టి, అప్పుడు చూడు కనిపిస్తాయి.
మీరు చాలా పెద్ద మనుషులూ, పద్ధతైన మనుషులూ, థాంక్స్ మామగారూ అంటూ చెక్కుని కళ్ళకద్దుకుని, తిరుగు ప్రయాణమయ్యేడు సత్యతో సహా.
ఊరికి చేరుకున్నాక, చెక్కుని ఏసీ రూములో కాసేపు వుంచి చూస్తే, అక్షరాలేవీ కనబడలేదు మకరేష్ కి.
ఒకరోజంతా ఉంచి చూసేడు. ఐనా ఏం ప్రయోజనం లేకపోయింది.
ఇహ ఇలా కాదనుకుని, సత్య నోకియాని చేతికందుకుని 'NO' క్రియాపరురాలిగా, గంటసేపు మాట్లాడింది వాళ్ళ నాన్నతో.
మా నాన్నగారు చెక్కుని INVISIBLE ఇంకుతో రాసేరుగదండీ. రాసేటప్పుడు పెన్నులో బహుశా ఇంకు అయిపోయిందేమో అంటున్నారండీ. అది INVISIBLE ఇంకు కాబట్టి కంటికి కనబడదు కదా? అయిపోయిందో లేదో తెలుసుకొనలేకయేనంటున్నారు.
టీవీలో స్క్రాలింగ్ న్యూసులో 'సెన్సెక్స్ భారీ పతనం 3000 దిగువున నిఫ్టీ' కదుల్తోంది. అత్తవారి ఊళ్ళో హరిదాసు పాడిన కీర్తన మకరేష్ చెవిలో గింగురుమంటోంది.
దానిని ఇలా అనువదించుకున్నాడు మకరేష్
'హరిలో రంగ హరీ!...
నా స్టాకు బ్రోకరా!నన్ను బ్రోవ రారా!
ఆ దలాల్ వీధిలో దయ చూప రారా!
నా డీమాట్ అకౌంటులన్నియూ
INVISIBLE అగు ఇంకుతోడనూ
రాసినావు కదరా నన్ను దోచినావు కదరా!
నా స్టాకు బ్రోకరా! నన్నూ బ్రోచినావు కదరా!
..... శ్రీకృష్ణార్పణం!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|