|
|
Articles: My Experience | కుక్కపిల్లలు - Mr. Bhaskar
| |
మా ఇంటి ముందు ఒక కుక్క నాలుగు పిల్లలకి జన్మనిచ్చింది. అప్పుడు అవి చిన్నగా ఉన్నప్పుడు ఇంటిలో మిగిలిన అన్నం లేనప్పుడు పాలు కొనిపించి ప్రతిరోజూ ఆహారం పెట్టేవాడ్ని. కొన్ని నెలలయ్యాక మగపిల్లలు పెద్దవై ఎటో వెళ్ళిపోయాయి. కాని ఆడపిల్ల మా ఇంటినే నమ్ముకొని బ్రతుకుతున్నది. సరే ఈ కుక్కపిల్ల పెద్దదై ఎప్పుడు పెళ్ళయ్యిందో నాకు తెలియదు కాని... గర్భం దాల్చి ఒక తండ్రి దగ్గరకు వచ్చినట్లు నేను ఆఫీసు నుండి రాగానే నన్ను చుట్టుముట్టేది. ప్రతిరోజూ నేనున్నపుడు ఒక పూట ఆహారం పెట్టి పగలు ఏదైనా ఆహారం పెట్టమని మా ఆవిడకి చెప్పి ఆఫీసుకి వెళ్ళేది. సరే.. తనకు గుర్తున్నప్పుడల్లా కొంచెం ఆహారం పెట్టేది.
ఈ మధ్యనే ఈ ఆడ కుక్కపిల్ల రెండు మగపిల్లలకి రెండు ఆడపిల్లలకి జన్మనిచ్చింది. ఒకటా రెండా ఈ ఐదింటిని రెండు నెలలుగా పోషిస్తూ వస్తున్నాను. మా ఆవిడ అన్నం పెట్టిన రోజున నేనొచ్చేసరికి హుషారుగా ఉంటాయి, పెట్టని రోజున ఇవి నా చుట్టూ జాలిగా తిరుగుతాయి. రాత్రి పదకొండైనా వీటికి అన్నం పెడతాను.
ఈ మధ్యనే పైన ఇంటిలోకి మకాం మార్చాం. ఈ పిల్లలన్నీ రాత్రిపూట ద్వారం వద్దనే పడుకొని మలముత్రాలు విసర్జించి పాడుచేస్తున్నాయి. అసలే మార్బుల్` ఫ్లోరింగ్`... ఈ కుక్కపిల్లల సేవకు పనామె రెండొందలు ఎక్కువ ఇమ్మంటున్నది. సరే అన్నాం. మా ఆవిడ కుక్కపిల్లలు కావాలో తాను కావాలో తేల్చుకోమంటున్నది. ఒక నెలలో అవి పెద్దవై వెళ్ళిపోతాయిలే అంటున్నాను. హితబోధ కూడా చేశాను. షిరిడీ వెళ్తే అక్కడి భక్తులు కుక్కలని దొరికించుకొని మరీ పాలు కొని... తాగించి వస్తారని, అర్థం చేసుకొని... తను కూడా కొంచెం సహకరించింది. ఎంతైనా ఆడవాళ్ళు కదా మనకెందుకండి ఈ లేనిపోని గొడవ... ఇరుగు పొరుగు ఎవ్వరూ వాటిని రానివ్వటంలేదు... అందుకనే నేను వాటిని పోషిస్తున్నాను...
ఒక రోజు మా ఆవిడ ఎక్కువ గొడవపెడితే... నాకు పెట్టిన అన్నం కొంచెం తిని మిగిలినది వాటికి పెట్టాను... మరుసటి రోజు నుంచి వాటికని కొంచెం ఎక్కువ వండి పాలు కలిపి పెడుతున్నది... వాటి జాలి చూపుల ముందు మా ఆవిడ పదే బాధ కనిపించటంలేదు. ఎలాగో రెండు నెలలు పెంచాం... కొంచెం పని వత్తిడిలో ఉన్నాను, ఒక్క నెలరోజులు ఆగు అవి కొంచెం పెద్దవైనాక...ఏదో ఒక మటన్ షాపు వద్ద వదలి వస్తాను...
ఈ కుక్కపిల్లలనే వదిలించుకోలేక పోతున్నాను... మన పిల్లలు పెద్దవాళ్ళై ఉద్యోగరీత్యా మనలను వదిలి వెళ్ళిపోతే... నేనైతే... భరించలేను... అలానె మా అమ్మకు దూరం కాలేక పోతున్నా... నువ్వంటె మధ్యలో వచ్చావు... కన్న ప్రేమ అలాంటిది... ఆ కుక్కపిల్ల కూడా తన నాలుగు పిల్లలను నిద్రలేకుండా వేరే కుక్కలు పిల్లలను కరవకుండా రేయింబవళ్ళు ఎంతజీవన పోరాటం చేస్తుందో నీకేం తెలుసు?... అయ్యా నీకో దణ్ణం... నా ఖర్మకి ఆ కుక్కపిల్లలను కనింది... ఒక్క నెల రోజులు సమయమివ్వు వాటి సమస్యను పరిష్కరిస్తా... అంతవరకు భరించాల్సిందే..:)
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|