TeluguPeople
  are the trend-setters

 
Articles: Short Stories
ఆన్ లైన్ పెళ్లి
- Editor
  Page: 1 of 5   Next > >  
(గణపతిరాజు నరశింహరాజు) ఫోన్ మోగుతూనే ఉంది. పట్నంలో ప్రజలకు కూడా ఎప్పుడో తెల్లవారిపోయింది. రిటైరయి ఇంట్లో వుంటున్న నాకు మాత్రం ఇంకా బద్ధకంగానే ఉంది. పై ఆఫీసర్లను మెప్పించడానికో, పదవిని పదిలంగా కాపాడుకోవడానికో సరైన నిద్రకూడా పోకుండా తెల్లవారక ముందే భయం భయంగా గాబరా గాబరాగా లేచిన రోజులు కాలగమనంలో కలిసిపోయాయి. ఇప్పుడైనా ప్రశాంతంగా నిద్రపోకపోతే ఎలా అని నా సిద్ధాంతం. ఆయుర్దాయం ఇంకా పెంచేసుకొని పెళ్ళాం పిల్లలతో అగచాట్లు పడడానికి తెల్లవారక ముందే లేచి మార్నింగ్ వాక్ కి బయలుదేరే వాళ్లతో నేను జట్టు కట్టలేదు. నాకు తోచినప్పుడు నాకు నచ్చినట్టు చేసేదే నా ఎక్సర్ సైజ్. రిటైర్ మెంట్ కి ముందు ఓ అయిదారు సంవత్సరాలు బడా ఆపీసర్ హోదా వెలిగించడాన్న ఫోన్ ఎవరైనా అందుకొని నాకివ్వడం అలవాటయింది. ఇప్పుడా పని నా శ్రీమతి జానకి చేస్తుంది. ఏం చేస్తాం. మరి ఉన్నది మేమిద్దరమే. పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగాలు. ఫోన్ ఇంకా మోగుతూనే ఉంది. జానకి అందుబాటులో లేదు. తప్పనిసరయి ఫోన్ ఎత్తి హలో అనకముందే చిన్ననాటి స్నేహితుడు ముకుందం 'ఎంత అదృష్టవంతుడివిరా బాబూ చక్కని ఇల్లు, తెలివైన భార్య, పొద్దెక్కినా ఆదమరచి నిద్రపోగల ఆత్మశాంతి... అని సాగదీస్తుంటే సోది మానేసి చెప్పరా బాబూ' అన్నాను. 'తీరికగా మాట్లాడే సమయం నాకూ లేదులే, రేపు లేదు ఎల్లుండి ఆదివారం రాత్రి ఏడున్నర, ఎనిమిది మధ్య మా ఇంటికి మీ ఉభయులూ విందు భోజనానికి వస్తున్నారు. తప్పని సరిగా రావాలి. సమయపాలన చాలా ముఖ్యం. ఎందుకు? ఎవరెవరు వస్తారు? అంటూ ప్రశ్నలతో సాధించక తప్పనిసరిగా ఇద్దరూ వచ్చేయండి. అన్ని ప్రశ్నలకూ సమాధానం ఆవేళ దొరుకుతుంది. ఫోన్ లో పిలిచానని ఏమీ అనుకోవద్దు' అంటూ ఫోన్ పెట్టేయబోయాడు. 'ఉండరాబాబూ, విషయం తెలియకపోతే ఈసారికి ఎగ్గొట్టేద్దామనుకుంటున్నాను' అనగానే 'ఆ పని చేయకునాయనా. మీ సిస్టర్... అదే మా ఆవిడ నా ప్రాణం తోడేస్తుంది. బుజ్జిగాడి పెళ్ళి ఆ రోజు' అంటూ ఫోన్ పెట్టేశాడు. ముకుందానికి ఇద్దరమ్మాయిల తరువాత ఒక అబ్బాయి. వాడి అసలు పేరు నందగోపాల్. ముద్దు పేరు బుజ్జి. ముకుందం సంతానమంతా అమెరికాలోనే సెటిలయ్యింది. వాళ్ళందరూ మంచి ఉద్యోగాలతో చక్కని ఇల్లు వాకిళ్లతో కళకళలాడే గ్రీన్ కార్డ్ హోదాలతో అమెరికాని ఆదుకుంటున్నారు. ముకుందం, అతని భార్య మాలిని కూడా అక్కడే సెటిలయి ఉండేవారు. కానీ ఇండియాలో వాళ్లు పెంచుకుని వస్తున్న ఆస్తులు కాపాడడానికి, పిల్లల గొప్పలు అందరికీ చాటి చెప్పడానికీ తప్పనిసరయి ఉండి పోయేరు.

Read 1 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 5   Next > >   
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2019 TeluguPeople.com, All Rights Reserved.