|
|
Articles: My Thoughts | మిగిలేది పరేషానే - Editor
| |
(బుచ్చిరెడ్డి)
కలా -- నిజమా
సరైన సమయంలో
సరైన నిర్ణయం అంటూ
ఇప్పటికీ ఒక మాట
మాటాడక ముందే--
తెలుగుదేశం మారుతుందీ
తెలంగాణాపై తీర్మానం చేస్తే
కలిసి పనిచేస్తాం--
బాబు-
మాయ మాటలు
బుజ్జగింపులు
తీర్మానాలతో
తెలంగాణా వాదాన్ని హైజాక్ చేసి
బోల్తా కొట్టించడం ఖాయం
తెలంగాణకు మిగిలేది
తక్లీఫ్ -- పరేషానే
తెలుగుదేశం-- తొమ్మిదేళ్ళ రీలు తిప్పి చూడు
పచ్చి మోసగాడు--దగాకోరు
ఈ రోజు
సి.ఎమ్ గద్దె కోసం
నానా గడ్డి కరుస్తూ
హామీలతో రాణాలతో
చిరు రైలు బెంగతో
తైతక్కలాడుతున్న బాబుతో
ప్రజాసామ్యం లేని తెలుగుదేశంతో
పొత్తు - నమ్మకాలు
మేక -- కసాయిని నమ్మడంలా
మొన్నటి ఉపఎన్నికల్లో
కర్ణుని చావుకు ఎన్ని కారణాలో
అన్నే కారణాలు తెలంగాణా రాష్ట్ర సమితి
ఓటమికీ పనిచేశాయి
ఇది నగ్నసత్యం -- పచ్చి నిజం
ఒక వైపు
కోస్తా రియల్ ఎస్టేట్ వ్యాపారులు
రాయలసేమ లాండ్ మాఫియాలు
శంబురాలు పడుతూ
తెలంగాణేయులను ఏమార్చడం -- ఖాయం
ఎంతకాలం-- బర్కతి లేని బతుకులు?
ఎంతకాలం-- దొంగ-- పోలీస్ ఆటలు?
ఎంతకాలం-- ఈ పొత్తులు
తేలేదెప్పుడు -- తెలంగాణా వచ్చేదెప్పుడు?
ఆ రోజు రావాలి
మన పాలన మనకు రావాలి
ప్రజాసామ్య ప్రజా తెలంగాణా రావాలి
జై తెలంగాణా
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|