|
|
Articles: Drama | తెలుగు విలువల ఉగాది - Editor
| |
(ఛాయరాజ్)
సర్వధారి కొకురోకో...
పాత కొత్త చీకట్ల కొట్లాట కావ్ కావ్...
పిచ్చుక కిచకిచలలోన 'కొత్తమాస'.
చిమ్మెటల రెక్క తెల్లతెల్లని మచ్చలపై నల్లనల్లని
చుక్కులై కూర్చున్నది చిమ్మచిమ్మ చీకటి.
ఉత్తరాభాద్ర గోర్జంట (బండి దారంట) పాడ్యమి
ఎల్లెద్దులను పూన్చి, చైత్ర శుద్ధ రధమెక్కి,
రేవతిపువ్వుల కొరడా ఊపుతూ వస్తోందదిగదిగో...
విరోధి సంవత్సరాది. అశ్వినదిగో, ధరణి భరణి
కుంకుమదిగో కృత్తికదిగో, ధగద్ధగాయమాన
రోహిణి భగభగ సరిహద్దులవిగో. విరోధశక్తి
చలనమదిగో... బతుకు యుద్ధభూమి పైన సన్నద్ధ
కార్యరంగమదిగో... కనురెప్పల విప్పులలోంచి
దుముకుతున్న కుప్పతెప్పల ఆశలవిగో, వరిగడ్డి
కుప్ప ఉడకలో తొంగోని లెగిసిన మీసమదిగో -
రైతు తన భార్యతో : భళ్ళున తెల్లారుతంది - బేగిరాయే బేగిరాయే
నాగలి కడిగుంచినాను - పూసీయే పసుపు
నక్కును (పొన్ను) తుడిసుంచినాను - రాసీయే కుంకుమ
పూదును పూసుంచినాను - వేసీయ్యే అచ్చింతలు
రైతుభార్యతో రైతుతో : ఓసోసీ... ఓసోసీ - పల్లకోవ (వూరుకో) మళ్ళ
వుడకలోన తొంగొనీ - ఉలిక్కిపడీ లేచినావు
అరదరేత్రి లేచినీను - అన్నీ సర్ది వుంచినాను
వేపపుల్ల ఇదిగిదిగో - పల్లు తోముకో గబగబ
చెరువునీరు దెచ్చినాను - ముఖం కడుక్కో శుద్ధిగ
నిద్దర్లో తూగుతున్నరు - గుంటల్ని (పిల్లల్న) లెగ్గొట్టు యెళ్ళి
తూరుపు ఆకాశం - తెలతెల్లగవతంది మరి
బేగిరా బేగిరా -ఏరు పూస్తావెప్పుడు
రైతు : ఓల్నీ... అర్థరేతిరి లేసి - ఏటిసేసినావు పిల్ల
యేలైపోతందన్నావు - లేపలేకపోయినావ నన్ను
భార్య : ఇకటాలకి సకటాలకి - యోలయ్యిందేటిప్పుడు
బేగిలేపి తేటిసేద్దువు - కాలల్లో కర్రెడదువు
పరాసికాలాడుకొని - పనిపడనిత్తువేటి
పల్లకోవ పిలడ - సిల్లికుండ్ల నీళ్ళొట్టకు
సిగ్గులేకపోతెసరీ - ఎకసెక్కాలు మళ్ళ
గోలెంలో నీళ్ళున్నయి - తానమాడి రా వోయా
యేలైపోతన్నాదీ - ఏరుబూయ రా మగోడ
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|