|
|
Articles: My Thoughts | ఆ నీరు స్వచ్ఛం కాదు - Site Administrator
| |
డా.దుగ్గరాజు శ్రీనివాసరావు
మహానగరాల్లో నడుస్తున్న అతిపెద్ద వ్యాపారం, భారీ లాభాలు ఆర్జించే వ్యాపారం ఏమిటని ఎవరినైనా ప్రశ్నిస్తే ఠక్కున వచ్చే సమాధానం 'రియల్ ఎస్టేట్' వ్యాపారం అని. ఆ వ్యాపారం వారు చేసే హడావుడి, వ్యాపార ప్రకటనలు చూసినవారికి అది బడా లాభాల వ్యాపారం అనిపించవచ్చు. కాని అసలు లాభాలు ఆర్జిస్తున్న వ్యాపారం మంచినీటి వ్యాపారం.
నగరాలు, ఒక మోస్తరు పట్టణాలలో ఎక్కడ చూసినా కనిపించేవి 'ప్యూర్ మినరల్ వాటర్' అనే మంచినీటి సీసాలు. ఇంతకుముందు షాపులకు పరిమితమైన ప్లాస్టిక్ సీసాలు, సైజు పెంచుకుని ఇళ్ళల్లోకి, ఆఫీసుల్లోకి వచ్చాయి. ఎక్కడ చూసినా ఒక కుండ వంటి ప్లాస్టిక్ పాత్ర, దాని మీద నీటితో నింపిన, బోర్లించి వున్న పీపావంటి మరోపాత్ర. ఈ పీపాలకే కూలర్ అమర్చిన ఏర్పాటు మరికొన్ని ఆఫీసులలో. ఇదంతా రక్షిత నీరు అందించే యత్నంలో భాగంగా ప్రచారం.
నీటి విషయంలో జాగ్రత్త అవసరమే. ఎందుకంటే నీటి ద్వారా వ్యాప్తి చెందే రోగాల సంఖ్య అధికంగా వుంది. వైద్యశాస్త్రం ఆ రోగాల గురించి ప్రజలలో అవగాహన పెంచింది. పెరిగిన ఆ అవగాహనను తమ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నారు. రక్షిత మంచినీరు తాగాల్సిన అవసరాన్ని చెప్పి, తెలివిగా మా నీరు తాగండి అంటున్నాయి కంపెనీలు. 'మా నీరు మహా స్వచ్ఛమైనది, ఎటువంటి సూక్ష్మజీవులకు తావు లేనిది' అంటూ ప్రచారం చేస్తున్నారు.
అయితే ఇది నిజమా? ఆ నీటిని ఎక్కడ సేకరిస్తున్నారు. ఎలా ప్రాసెస్ చేస్తున్నారు. నిజంగా నాణ్యమైన నీరా! అందులో ఏమున్నాయి? అని ఎప్పుడైనా ఆలోచించారా? నీటి నాణ్యతను పట్టించుకోవటం లేదు సరే! మీ ఇంటికి చేరేసరికి ఎటువంటి మురికిని కూడగట్టుకుంటున్నాయో గమనించారా?
'ప్యాకేజ్ డ్ వాటర్' అని ముద్దు పేరు పెట్టుకున్న నీటి వ్యాపరస్తులు సరఫరా చేస్తున్న 'రక్షిత నీరు' మనమనుకునేంత రక్షణతో కూడినది కాదు. భూగర్భజలాలను ఏదో ఒక చోట నుండి తీస్తున్నారు. అక్కడి నుండి వడగడుతున్నారు. అది రసాయన వడపోత, ఎలక్ట్రానిక్ వడపోత అంటూ రకరకాలుగా ప్రకటిస్తున్నారు. అలా ఫిల్టర్ చేసిన నీటిని పెద్ద పెద్ద సీసాలలో వేసి బయటకు పంపిస్తున్నారు.
అక్కడి నుండి వాహనాలలో గుట్టలు గుట్టలుగా వేసుకుని బయలుదేరతారు. ఆ వాహనాల మీద ఎటువంటి కప్పూ ఉండదు. ఆ పెద్ద నీటి బాటిల్స్ ని రహదారుల మీద తెచ్చేటప్పుడు ఇతర వాహనాలు వదిలే నల్లని పొగలను తమనిండా కప్పుకుంటున్నాయి. దుమ్ము, ధూళి ఆ వాటర్ బాటిల్స్ మీద పేరుకుంటున్నది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|