|
|
Articles: My Thoughts | అమ్మతో నేను... - Mrs. sujatha Thimmana
| |
ఆకశంలో కి ఎగురుతూ...వాపోతున్నా.....అయ్యో! అమ్మకి దూరం అవుతున్నానే....అని.
కానీ....అమ్మ కలలు పండించడానికే కదా నేను వెళుతున్నదీ...అనే ఓదార్పు.
గోరుముద్దలు తినిపించేటప్పటినుంచీ గుర్తు....నా చేతులు పట్టుకుని ఎ.బి.సి. అని దిద్దించిన దగ్గరనుంచీ...నన్ను చవిదించడానికి ముందు 'అమ్మ' తను చదివి అర్థం చేసుకుని నాకు చెప్పేది. చాలా మంది పిల్లలు ట్యూషన్ కి వెళ్ళేవాళ్ళు కాని నాకు ఏవిదంగ అర్థం అవుతుందో అది 'అమ్మ' కి మాత్రమే తెలుసు అందుకే మాథ్స్ కూడా కష్టపడి నేర్చుకుని నాతో చేయించేది. నా తో పాటూ నిద్ర మేల్కొని నాకు కావలసినవన్నీ చూసుకునేది. పరీక్షలు రాయడం నా వంతయితే టెన్షన్ అంతా తను పడేది. అలా....టెంత్....ఇంటర్....ఇంజనీరింగ్....చివరికి యం.బి.ఎ. లో కూడా నా మట్టి బుర్రకి అర్థం కాకపోతే....ఓ సారి అమ్మని చూడమని చెప్పి అమెతో చెప్పించుకునేదాన్ని. మీరు నమ్మరేమో కానీ ఇది నిజం! ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా అమ్మ సలహా పాటించి విజయం సాధించాను. వెయ్యి మందిలో ఉన్నా... నేనే మొదటిదాన్ని ఎప్పుడూ....
ఇంత చెపుతున్నాను అంటే అమ్మ ఎంతో చదువుకుంది అనుకుంటున్నారేమో.... అది పొరపాటే....అమ్మకి టెంత్ అవగానె పెళ్ళి....తరువాత నేను...నిరంతరం నా ఉన్నతిని అభిలషించే అమ్మకి నేనేమివ్వగలను....అమె ఆశలు నెరవేర్చడం తప్ప...
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|