|
|
Articles: Devotion | ప్రభూ.... - Mrs. sujatha Thimmana
| |
కన్నీటితో నీ పాదాలు
కడగాలనుకున్నాను
కానీ....కలతలతో
ఆ కన్నీళ్ళు కలుషితమయ్యాయి
మనసుతో నిన్ను
అర్చించాలనుకున్నాను
కానీ.... మమతలని
మరచిన మనసు
మూగబోయింది
హృదయంలో నిన్ను
నిలుపుకోవాలనుకున్నా
కానీ....అనుభందాల
జడివాన నీటి ప్రవాహంలో
ఆ హృదయం ఎక్కడికో
కొట్టుకు పోయింది
హృదయం లేని నేను
ప్రాణం విడచి సంచరించే
ఒంటరి ఛరినయ్యాను
అనంతానంతాలు కూడా
నీ అధీనంలో
అలవోకమవుతున్నాయి
నేనల్పమని చెప్పటానికి కూడా
అర్హత లేనిదానను
కానీ...నాకోసం నీవున్నావనే
నమ్మకం ఏ మూలో దాక్కొని
నీ ముందు ప్రణమిల్లజేస్తుంది
ప్రభూ.....!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|