|
|
Articles: Devotion | వందనం - Mrs. sujatha Thimmana
| |
సింధూర వర్ణా
సుందర రూపా
వాయు పుత్రా
వందనమిదిగో....
రఘుకులోత్తముడు
శ్రీ రాముని సేవకుడవు
రాజ్యాలేలిన ఆ
మహారాజును హృదయమున
బంధించిన వాడవు
నీ జననమైన ఈదినము
ఆ రాముడు మాకందించిన
మహా భాగ్యమైన వరమూ...
అందుకో వందనమూ.....
ఆకు పూజలతో....
అర్చన చేయనా
వడల హారాలతో
నిను అలంకరించిన
మనసున నీ స్మరణతో
అభిషేకము చేయనా
రామునికి దాసుడవు నీవు
నీకు దాసుడ నేను
అందుకో వందనమూ.....
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|