|
|
Articles: Devotion | ఇదే మన సద్గతి - Site Administrator
| |
(ఎమ్.ఎస్.ఎస్.శర్మ)
`నిన్ను నీవు కానలేనివాడివి జగత్తునేం చూడగలవు?
జగత్తును చూడలేని నీవు సత్యాన్ని ఎలా కనుగొనగలవు?'
సృష్టికి మూలకారకుడు భగవంతుడు. భగవంతుడు సృష్టించిన భోన భోంతరాళాల్లో మానవుడు ఒక రేణువు మాత్రమే సకల చరాచర సృష్టిలో మానవుడు ఒక భాగం మాత్రమే. మానవుని సంతృప్తికై సృష్టిలోని ప్రతి అణువు ఏదోవిధంగా ఉపయోగపడుతుంది. కాని మానవుడేవిధంగా ఉపయోగపడుతున్నాడు?
మరొక రకంగా ఆలోచిద్దాం. మనుష్యులందరూ కలిస్తే సంఘం, మానవుడు సంఘాన్ని విస్మరించి తనకు తానుగా ఒక్కడూ బ్రతకలేడు. కష్టంలో, సుఖంలో, పనిపాటలలో ఇలా అన్ని విషయాలలో తోడు లేకుండా, మరొకరిమీద ఆధారపడకుండా జీవించలేడు. ఇంత సహకారం సంఘాన్నించి తీసుకొని తన జీవతయాత్ర సాగిస్తున్న మనిషి, తన తరఫునుండి సంఘానికి తిరిగి ఏమిస్తున్నాడు? అంటే సంఘం తనకు సహకరిస్తోంది. కాని తను సంఘానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు.
సంఘం అంటే అందరూ కలిసిమెలసి సహజీవనం చేయడమే. అందులోని ఒక భాగంగా మనం ఎల్లప్పుడూ పదిమందికి ఉపకరించే విధంగా ఏ పనైనా వెనకాడకుండా చేయాలి. అప్పుడు నీవు సంఘంపట్ల నీ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చినట్లు. శ్రీ సాయినాధుడు మనకు ఆచరణలో చూపించిన విధంగా తోటి మానవునికి ఏదో విధంగా ఉపయోగపడగిలిగితే అదే మనకు సద్గతి.
మానవసేవయే మాధవ సేవ
ఓం సాయిరాం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|