|
|
Articles: Recipes | పాలక్ పకోడీలు - Site Administrator
| |
(లక్ష్మీ ఎమ్)
కావలసిన పదార్థాలు :
పాలకూర - రెండు కట్టలు
సెనగపిండి - పావు కేజీ
బియ్యంపిండి - రెండు టీస్పూన్స్
నూనె - వేయించడానికి సరిపడా
అల్లం - చిన్నముక్క
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి సరిపడా
జీలకర్ర - అర టీస్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
తయారీ విధానం :
ముందుగా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి మిక్సీలో పేస్ట్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకున్న పాలకూరను, కరివేపాకును ఓ గిన్నెలోకి సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. సెనగపిండి, బియ్యంపిండిలో కొద్దిగా నూనె వేడి చేసి పోయాలి. తర్వాత పాలకూరను, అల్లం పేస్ట్ ను కలిపి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తరువాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా వేసి దోరగా వేయించి తీసేయాలి. అంతే రుచికరమైన పాలక్ పకోడీలు రెడీ.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|