|
|
Articles: My Thoughts | ధర్మాచరణ - Mrs. Kanaka Durga
| |
ధర్మో రక్షతి రక్షిత: అన్నది
అజరామరమైన వేదవాక్కు
సర్వాకాల సర్వావస్థల యందు
ధర్మాచరణ భారతీయుల కర్తవ్యం
ధైర్యం, ఓర్పు, మనోనిగ్రహం
ఇంద్రియ నిగ్రహం, శాంతం
సమాజ సేవ, సత్య భాషణం
అలవర్చుకోవల్సిన సద్గుణాలు
ధర్మ హీనమైన జీవితం
చంద్రుడు లేని రాత్రి వలే శోభించదు
ఎన్నో హంగులు సమకూరినా
ధర్మాన్ని పాటించని జీవితం నిరర్ధకం
కామ క్రోధాది దుర్గుణాలను జయించి
వీలైనంతగా దాన ధర్మాలు చేస్తూ
శాస్త్రాలు విధించిన కర్మలను
విధిగా ఆచరించేవారే
ధర్మాత్ముల వలే ప్రసిద్ధి పొందుతారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|