|
|
Articles: Poetry | అందే నా...? - Mr. VENKAT ESWAR RAO
| |
అందే నా...?
అహాన్ని జీవిత అహవమ్ లో
హతమార్చాలని
దేహపు రంగుల పొంగుల
అంతం చూద్దామని
మోహావేశ పాశాలను
సమూలంగా సంహరించాలని
జిహ్వే న్ద్రియ చాపల్యాన్ని
మృత్యు గహ్వరంలోకి అంపాలని
సర్వ దేహ శత్రు సంహారం
జరపాలని
.........................
గర్వోన్మత్తుడనై
కర్తవ్యం మరచి
శక్తి రాక మునుపే
మించిన కర్మానుష్టానం
చేయాలని....
ఆతృతలో
మాయా దేహ వ్యామోహ వహ్నిలో
ఆహుతయ్యాను!
ఐశ్వర్యపు వటవృక్షపు నీడలో
దేహపు తళుకుల బెళుకులలో
చెళుకులు విసురుకుంటూ
భళి భళీ అని
నన్ను నేను పొగుడుకుంటూ
ముళ్ళబాటలో నిల్చిన
ముష్కరుణ్ణి
ముముర్షువుని!
గీతామంత్రం నూరిపోసిన
ధైర్యం జారిపోగా
వేదాలుద్బోధించిన దారి
దూరమై... భారమై...
కలలన్నీ కల్లలై
నల్లనయ్య మాయలో పడి
చలనమూ లేని శిలనైనాను వెర్రినై
అంధుడనైతీ నేత్రములుండి!
కర్తవ్యమెఱిగి నిర్వర్తించలేక నిశ్చేష్టుడనైతీ!
అందే నా మరి ఆతుర సన్యాసమైనా?
లేక
నా పలాయనవాద విజృమ్భణకు
మృత్యువు కూడా
దరి చేరి
తిరిగి
దూరమై
మనసు మార్చి
కపట సన్యాసిని జేయునో?
శరణార్థినగుచు
నీలో ఐక్యమయ్యే
శుభ తరుణం...!
కాలుని పిలుపు కొరకు
ప్రతీక్షిస్తున్నాను
కాలహరణం చేయకుమా
మరలా నా మనసు మారేను!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|