|
|
Articles: Poetry | ఎవరివైనా...?? - Mr. VENKAT ESWAR RAO
| |
గాలివా నీవు
శ్వాసవవుదువు
కాంతివా నీవు
ఆత్మజ్యోతిగా నిలిచి ఉందువు
నీటివా నీవు
కన్నులలో నింపుకొందు
గరళమా నీవు
పరమశివుడనౌదు నేను
అగ్నివైతే జఠరాగ్నితో
మైత్రీబంధం కలిగిస్తూ
ప్రేమ ప్రేవులబంధా బంధనాల
వ్రేలుస్తూ
అనురాగ యాగంలో!
నేలవైతే
కౌగిలించుకు
పవళింతు...
పరవశంతో
కరకైనా గాని!
నింగివైతే
విహంగమై
విహరిస్తా
అపరాహ్నంలో
అమవాస నిశీధిలో!
నీవేమైనా
నీవెవరివైనా
నీపై
నా వైఖరి మారదు
గురుతుంచుకో ప్రియ
నే మరణించినా!!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|