|
|
Articles: Poetry | ప్రేమ నిద్దుర - Mr. VENKAT ESWAR RAO
| |
ఏ శాఖానీ అడగా లేదే...?
శాక పాకాలేవీ కోరలేదే?
తీవ్ర ప్రేమాసుమా పరిమళాఘ్రాణ
కాంక్ష దక్క కోరలేదు!
కరుణారస పూర్ణ చిరుదరహాస
చంద్రికలు దక్క కోరలేదు!
పాదాల కదలికలకు ప్రాణమిచ్చు... ఘల్లు ఘల్లుమని
శబ్దించు అందెలవ్వాలని దక్క కోరలేదు..!
నిశా సమయాన ప్రభాత ప్రభాకారుని
విరహ బాధితమైన పుడమి వోలె..
నీ సందర్శనా భాగ్యము దక్క కోరలేదు!
దుక్కి దున్నిన భూమి
విత్తుకై వగచు రీతి!
ఎదిగిన హృదయం
మరో మది చేరువకై
చేరికకై కరవుగా ఉంది!
నీవె నా ఏలిక! కావాలిక!
ఏలిక.. ఈ సువిశాల సామ్రాజ్యం పాలికా!
పరిపాలించిక!
హక్కుతో హుకుం జారీ చెయ్యి!
హూంకరించు!
సిద్ధంగా ఉంటా! గులామునై!
నా రాణీ.. ప్రేమ సిద్ధిస్తే!
హృదయం నిద్రిస్తే!?
అలసి సొలసి కాదు..
నీకై నీవు దారి చూపిన
వలపు ఒడిలో!
నిద్రిస్తా... కలకాలం!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|