|
|
Articles: My Thoughts | అనుకుంటున్నావా బాపూ! - Mrs. sujatha Thimmana
| |
భరతమాతకి పురిటి నొప్పులనిస్తూ.... మళ్ళీ జన్మించాలని అనుకుంటున్నావా... బాపూ...!
రెండేళ్ళ చిరుప్రాయంలోనే... బ్యాగు తగిలించుకుని పరిగెట్టాల్సొస్తుంది 'ఫ్రీస్కూలు' కి... ఆ తరువాత అర్థమయ్యేటట్టు చెపుతున్నామనుకుంటూ అనవర ఙ్ఞానాన్ని అర్థంలేని విధంగా చెప్పే అలంకారపు చదువులతో స్కూలు దాటితే మరి రెండేళ్ళు నిర్బందవిద్య (ఇంటర్మీడియట్) పేరుతో చెఱసాల జీవితం... (ఆ జన్మలోలాగా భారిష్టరు చదువుదామనుకోలేవు) తప్పని సరి ఇంజనీరో... డాక్టరో... డిగ్రీ తీసుకుని చదువుల ప్రపంచంలోనుంచి బయట పడ్డ నీవు ఇందేంటి నేను మళ్ళీ 18వ శతాబ్దంలో ఉన్నాను... అనుకుంటావేమో... ఈ బానిస బ్రతుకులను చూసి....
ఇంగ్లీషుదొర తనజాతి స్వాభిమానం కోసం మనలని హింసించాడేమో... కానీ... మన నాయకులు తమ స్వార్ధం కోసం... పేరుకి ప్రజా పాలన చేస్తూ... కొన్ని వేల కోట్లు స్వాహా చేస్తున్నారు. తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి, కట్టే బట్టా... అన్ని కల్తీనే...
'అర్ధ్రాత్రి ఆడది వంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం' అన్నావు కానీ ఆడపిల్ల (మూడేళ్ళ పసిపిల్ల దగ్గరనుంచి 80 య్యేళ్ళ ముదుసలి వరకూ) కి బద్రత లేదు ప్రస్తుత సమాజంలో... కళ్ళు మూసుకుపోయిన కామాందులు... ప్రేమ పేరుతో బలితీసుకునే ప్రేమోన్మాదులు...
ఏ క్షణం ఏమౌతుందో... ఎక్కడ ఏ బాంబుపేలుతుందో... 'కసబ్' లాంటి కసాయి తేజం ఎక్కడ కబళిస్తుందో... అని క్షణక్షణం భయంతో వణుకుతూ... రుధిరాశ్రువులు రాలుస్తున్న నీ తల్లి భరతమాతని ఏమని ఓదారుస్తావు...?
క్రితం జన్మలో నయితే... సత్యాగ్రహం సాయుధంగా... అహింస ఆయుధంగా... బ్రిటిష్ వాళ్ళని తరిమి తరిమి కొట్టావు... కానీ 'అహింస, సత్యం అనే పదాలు మైక్రోస్కోపుతో వెతికినా కానరావటంలేదు నేడు... కాబట్టి...' బోడిగుండూ... కళ్ళద్దాలు... బోసినవ్వు....ఉన్న బొమ్మలోనూ... విగ్రహాల్లోనూ దూరిపోయి ఎందుకులే నాకీ మరు జన్మ అని అనుకుంటున్నావా... బాపూ...!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|