|
|
Articles: Recipes | టొమేటో రైస్ - Site Administrator
| |
కావలసిన పదార్థాలు
బియ్యం : 1 గ్లాసు
నీళ్ళు : 2 గ్లాసులు
టొమాటోలు : 10
ఉల్లిపాయలు : 2
అల్లం వెల్లుల్లి : 1/2 టీ స్పూన్
పచ్చిమిర్చి ముద్ద : 1/4 టీ స్పూన్
గరం మసాలా : టీ స్పూన్
కొత్తిమీర, పుదీన : చిన్న కప్పు
ఉప్పు : రుచికి సరపడ
నూనె : అరకప్పు
నెయ్యి : 1 టీ స్పూన్
వేరుశనగ గుళ్లు : అర కప్పు
జీడిపప్పు : 15
పసుపు : చిటికెడు
తయారు చేయు విధానం : బియ్యం 1 గ్లాసైతే రెండు గ్లాసుల నీళ్ళు పోసి కొంచెం పలుకుగా ఉండేలా అన్నం వండి ఒక బేసిన్ లోకి ఆరబెట్టి అందులో నెయ్యి, చిటికెడు పసుపు కలపాలి. టొమోటాలను, ఉల్లి పాయలను తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. తర్వాత టొమోటా ముక్కలు వేసి అయిదు నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఈ ఫేస్ట్ ని అన్నంలో కలపాలి. అలానే వేయించిన వేరుశనగపప్పు, జీడిపప్పు వేసుకోవాలి. చివరగా కొత్తిమీర, పుదీన వేసి అలంకరించుకోవాలి. అంతే నోరూరించే టమోటా రైస్ రెడీ.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|