|
|
Articles: Devotion | ఓ రామా.. - Mrs. sujatha Thimmana
| |
ఓ రామా... శ్రీ రామా...
ఏమి మర్మము నెంచి
నాకీ జన్మనిచ్చితివో...
ఏమరుపాటున నను గమనించకనే
నాకీ జన్మనిచ్చితివో...
మనజాలకుంటినీ మనుషుల మధ్యన
బలహీనపడితినీ... అనుబంధాలబిగిలో
నిర్జీవమవుతున్న నిజాల కళేబరాలపై...
నడవలేక నీరసపడుతుంటినీ...
ఓ రామా... శ్రీ రామా...
నీ తలపుల ఉదయం
సాయంసంధ్యను చేరి
చీకటిలో కలిసిపోతుంటే
ఏమరుపాటున ఉలికిపడీ
నీ తలపును మరచిన క్షణం
నాకిక వద్దే వద్దని
నీకు విన్నవించుకొంటిని...
ఓ రామా... శ్రీ రామా...
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|