|
|
Articles: Recipes | డేట్స్ ఖీర్ - Site Administrator
| |
పాలు - అరలీటరు
ఖర్జూరాలు - ఎనిమిది
పంచదార - అరకప్పు
జీడి పప్పు - 15,
బాదం పప్పు - పది
పిస్తా - 10
వాల్నట్స్ - 6
తయారుచేయు విధానం : పావు కప్పు పాలల్లో ఖర్జూరాలు వేసి, రెండు గంటలసేపు నానబెట్టాలి. ఖర్జూరాల్లోంచి గింజలు తీసివేసి, పైన చెప్పుకున్న పప్పులన్నీ వేసి నానబెట్టాలి. అవి బాగా నానిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మిగిలిన పాలను చిక్కగా అయ్యేంతదాకా కాచి, పంచదార వేసి కలపాలి. సన్నటి సెగపైన పంచదార మొత్తం కరిగేదాకా కలుపుతూ ఉండాలి. పాలు సగానికి అయ్యేంతదాకా కాచి, అందులో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కలిపి ఉడికించాలి. అడుగు అంటకుండా కలిపి దించేయాలి. చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో ఉంచి, చల్లబడ్డాక సర్వింగ్ గ్లాసుల్లో నింపి సర్వ్ చేయాలి. ఖర్జూరాలతో తయారు చేసిన ఈ ఖీర్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తేలికగా జీర్ణం అవుతుంది. డేట్స్‌లో ఐరన్ మోతాదు ఎక్కువగా ఉండటంవల్ల ఎదిగే వయసు పిల్లలకు ఇది మంచి ఆహారం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|