|
|
Articles: Recipes | కాలీఫ్లవర్ చట్నీ - Site Administrator
| |
కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్ ముక్కలు : రెండు కప్పులు
ఉప్పు, కారం : తగినంత
నూనె : మూడు టీ స్పూన్స్
ఆవపిండి : రెండు టీ స్పూన్స్
మెంతి పిండి : అర స్పూన్
నిమ్మకాయలు : రెండు
ఆవాలు : అర టీ స్పూన్
జీలకర్ర : అర టీ స్పూన్
తయారు చేయు విధానం : ముందుగా కాలీఫ్లవర్ ను కడిగి చిన్న చిన్న ముక్కలుగా విడదీసి అడి లేకుండా బట్ట మీద ఆరబెట్టాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి ఆవాలు, మెంతులు విడివిడిగా వేయించుకోవాలి. తర్వాత వాటిని మిక్సీలో మెత్తగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరలా స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడాక కాలీఫ్లవర్ ముక్కలను వేసి ఐదు నిముషాలు వేయించి దించాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, ఆవపిండి వేసి కలపాలి. చివరగా నిమ్మరసం పిండి మరోసారి కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి బాగుంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|