|
|
Articles: My Thoughts | మాతృభాషకు దిక్కెవరు? - Site Administrator
| |
(ఛాయరాజ్)
'చాలాకాలం క్రితం ఒక మిత్రుడు మరొక మిత్రుడికి వ్యవహారిక భాషలో ఉత్తరం రాయడానికి యత్నించి...' కొ.కు. (బహుశా ఆ ప్రయత్నం ఫలితం ఇలా ఉండి ఉంటుంది - ఛాయరాజ్)
బాగ్గినగరం
తే : 0-10-2009 ది
బడే సత్తినారాయనకు బీర సనుముకరావు రాయునదీమనగా, మీము బావు, మీరు బావు అని అనికుంతన్నాం. నీనీ మద్దినే రిటేరయినాను. మానూరొకపాలొచ్చి, నీకు సూడలనిపిస్తున్నది. యగసాయం బాగా సేత్తన్నావా? నీ పిల్లాపిచికా ఎలగునారు. అమ్మికి పెల్లి సేసినావా? కుర్రోడికేదీన ఉద్దేగమా, నీలాగెవసాయమీనా? రెండు మూడ్రోజుల్లోన మనూరొచ్చి ఎలాగా నీకు సూత్తాను.
ఇలాగ, పేమతో నీ జతగాడు సనుముకరావు.
(సత్తినారాయణ 5వ తరగతి చదువు పూర్తిచేయలేదని సనుముకరావుకు తెలుసు)
'... తనకు వ్యవహారికంలో రాయడం చాతకాదని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అతను ఆ ఉత్తరం గ్రాంథికంలో అయితే అవలీలగా రాసి ఉండేవాడు' కొ.కు
వ్యవహారిక భాష ప్రాంతాన్ని బట్టి గూడా దాని పలుకుబడిలో మార్పులుంటాయి. తను రాసిన ఉత్తరం మిత్రుడ్ని పలుకరించడానికా, గేలిచేయడానికా? రాసిన ఉత్తరాన్ని పరపరా చింపేశాడు బీర షన్ముఖరావు.
కొ.కు. ఇలా అంటాడు... 'నిజం ఏమిటంటే మనలో చాలామందికి వ్యవహారిక భాషకూడా సరిగా రాదు. మనకు తెలుగు మాతృభాష కదా అని గర్వించి లాభం లేదు... కొద్దిమందిని మినహాయిస్తే పేరుబడ్డ రచయితలు కూడా వ్యవహారికం రానివారే...'
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|