|
|
Articles: Recipes | మిర్చి కర్రీ - Site Administrator
| |
బెంగుళూరు మిర్చి : 10
ఉల్లిపాయలు : రెండు
ధనియాలు : రెండు టీ స్పూన్స్
పచ్చిశనగపప్పు : రెండు టీ స్పూన్స్
వేరుశనగ పప్పు : రెండు టీ స్పూన్స్
కొబ్బరి కోరు : రెండు టీ స్పూన్స్
ఎండు మిర్చి : 6
అల్లం వెల్లుల్లి ఫేస్ట్ : అర స్పూన్
ఉప్పు : రుచికి సరిపడ
నూనె : ఐదు టీ స్పూన్స్
తయారు చేయు విధానం : ముందుగా ధనియాలు, పచ్చిశెనగపప్పు, వేరుశనగపప్పును, ఎండు మిరపకాయలను విడివిడిగా బాణలీలో దోరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని మెత్తగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లి పాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాణలీలో ఒక టీ స్పూన్ నూనె వేసి అందులో ఉల్లి పాయలను దోరగా వేయించుకోవాలి. దీనిలోనే మిక్సీ వేసుకున్న పొడులను, కొబ్బరి కోరు, కారం, అల్లం వెల్లుల్లి ఫేస్ట్, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు వేయించుకోవాలి. బెంగుళూరు మిర్చిని వంకాయల్లా నాలుగు పక్షాలుగా కోసుకోవాలి. వీటిలో వేయించుకున్న ఉల్లి కారాన్నికూరుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి అది వేడెక్కా బెంగుళూరు మిర్చిని వేసి ఒక్క విజిల్ రానివ్వాలి. అంతే ఎంతో రుచికరమైన బెంగూళూరు మిర్చి కర్రీ తయారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|