|
|
Articles: My Thoughts | బెంగళూర్ తెలుగు పిలుపు - Site Administrator
| |
(పట్టుబాల భాస్కర్ రెడ్డి)
16వ శతాబ్దంలో కర్ణాటాంధ్ర దేశాన్ని పాలించిన సాహితీ సమరాంగణ సార్వభౌముడు, పరిపాలనా పటిమతో స్వర్ణయుగాన్నే సృష్టించిన ఆంధ్ర భోజ బిరుదాంకితుడు శ్రీకృష్ణ దేవరాయల 500 పట్టాభిషేక మహోత్సవాన్ని బెంగళూరు తెలుగు సంఘం నిర్వహిస్తోంది. వచ్చే జనవరి 10వ తేదీ ఆదివారంనాడు బెంగళూరు ఉద్యానవన నగరంలోని కళ్యాణనగర్ హెచ్ఆర్ఐఆర్ లే ఔట్ లో ఉన్న ఇండో ఏషియన్ అకాడమీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ మహోత్సవానికి ఆంధ్రులు, ప్రవాసాంధ్రులు, కర్ణాటకాంధ్రులు, తమిళులు అందరూ హాజరు కావాలని ఆహ్వానం బెంగళూరు తెలుగు సంఘం ఆహ్వానం పలికింది.
ఈ మహోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఎనిమది మంది కన్నడాంధ్ర ప్రముఖులకు సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణ దేవరాయల ప్రశస్తిని బెంగళూరు తెలుగు సంఘం ప్రదానం చేస్తుంది. శ్రీకృష్ణ దేవరాయల గురించి ఈనాటి కర్ణాటక, ఆంధ్రుల ఐక్యత, మైత్రి నేటి యువతకు ఆదర్శనీయమో? ఆమోదయోగ్యమో? వివరిస్తూ నాలుగు పేజీలకు మించకుండా రాసిన వ్యాసాలను పోటీకి సంఘం ఆహ్వానించింది. ఈ పోటీలో గెలిచిన వారికి ఆకర్షణీయమైన బహుమతులను బెంగళూరు తెలుగు సంఘం అందజేస్తుంది. అదే విధంగా పిల్లలు, మహిళలు, పెద్దలకు విడివిడిగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహించేందుకు సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వీటిలో ముగ్గులపోటీలు, ఫ్యాషన్ షో, పాటల పోటీలు, జానపద నృత్యాలు, వక్తృత్వపు పోటీలు నిర్వహించనున్నది. ఆసక్తి ఉన్నవారు ఉచిత ప్రవేశంతో ఈ పోటీలలో పాల్గొనే వారు బహుమతులు గెలుచుకోవడంతో పాటు మహోత్సవాలకు హాజరయ్యే అతిథులను చక్కగా అలరించే అవకాశం కలుగుతుంది. ఈ పోటీలలో పాల్గొనే వారు దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేసి బెంగళూరు తెలుగు సంఘం కార్యాలయానికి డిసెంబర్ 31లోగా పంపించాలి. సంఘం కార్యాలయం చిరునామా ఇది: #9, గ్రౌండ్ ఫ్లోరా, బిహైండ్ ఆంధ్ర జ్యోతి, మునిస్వామి రోడ్, శివాజీనగర్, బెంగళూర్ 5600051, Tele Fax : 080-22860599, 9008999979, 9980011501, ఈ మెయిల్ : bngtelugusangham@gmail.com
ఈ మహోత్సవాలలో మరో విశేషం ఉంది. అది చవులూరించే రుచికరమైన విందు భోజనం. నోరూరించే పచ్చళ్ళతో పాటు ఆంధ్రా శైలి వంటకాలతో విందు భోజనాన్ని మహోత్సవానికి హాజరయ్యే అందరికీ ఉచితంగా వడ్డించేందుకు బెంగళూరు తెలుగు సంఘం ఏర్పాట్లు చేస్తుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|