|
|
Articles: Poetry | కన్నీటి చుక్క - Mrs. sujatha Thimmana
| |
కనురెప్పల అంచున చేరిన
కన్నీటి చుక్క
చెక్కిలిపై నుండి దూకి
ఆత్మహత్య చేసుకోబోతూ
క్షణంలో మిల్లీ సెకను
పునరాలోచన చేసింది
'ఇన్నాళ్ళూ తనను దాచుకున్న
కన్నుకి తాను దూరమైపోతే
ఏమౌతుందీ....!' అని
వెంటనే....రెప్పల అంచు నుండి
కంటిలోనికి జారి ఇనికిపోయింది
నేస్తం....!
ఆ 'కంటిచుక్క'
చేసిన పునరాలోచన
నీవూ చేసిచూడు
నీ చూపుల వాన కురియక
బీటలు పడిన నా గుండె
కనిపిస్తుంది
ఎండిన రక్తంతో
ఊపిరందక కొట్టుకుంటూ....
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|