|
|
Articles: Poetry | నా ప్రాణం - Miss Jyothireddy Sooram
| |
నిన్నా మొన్నా లేదాయే
మన ఇద్దరి మధ్యనా పరిచయం
ఈ రోజేనా సరికొత్తగా కలిశాం
అంటూ అడిగెను
నా మనస్సే ప్రతీక్షణం
కలగా ఏమో మారిందా
మన ఇద్దరి మధ్యన గడిచిన కాలం
ఇద్దరి మధ్యన తరగని దూరం
పెరిగేటందుకు ఏదీ నేరం...!
నిన్నా మొన్నా లేదాయే
మన ఇద్దరి మధ్యనా పరిచయం
ఈ రోజేనా సరికొత్తగా కలిశాం
అంటూ అడిగెను నా మనస్సే ప్రతీక్షణం
నీ కోసం నేనుంటాను
కలకాలమూ అంటూ వేసిన ఓట్లే
నన్ను మరిచాయా
నువ్వు నేను నడిచిన దారులు
నన్ను మాత్రం ఒంటరి చేసి
కళ్ళ ముందే కదులుతూ
ఉంటే ఫైపైకే ఎగిసేను నాప్రాణం
ప్రాణం కన్నా మిన్నగా
ప్రేమించానే నాలో ఉన్న నిన్ను
అనుకోకుండా పెరిగిన పరిచయం
నన్నే నువ్వయ్యేట్టుగా చేసిందే...!
నిన్నా మొన్నా లేదాయే
మన ఇద్దరి మధ్యనా పరిచయం
ఈ రోజేనా సరికొత్తగా కలిశాం
అంటూ అడిగెను నా మనస్సే ప్రతీక్షణం
నా నీడ నన్ను వదిలిందని తెలిశాక
అడుగు ముందు పడనందే
ఏ దారిలో నేనున్నా
నా చూపు వెతికేనే నీ స్పర్శ కొరకూ
ఇంత జరిగినా నా మది నమ్ముకుందే
ఏదో అలజడై నువ్వొస్తావని
కనురెప్ప వేయకుండా చూశానే
నీ రాక కోసం చిరునవ్వుతో...!
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|