|
|
Articles: My Thoughts | బిడ్డా బిలీవ్ సెయ్యకు - Mrs. haripriya haripriya
| |
చూస్తున్నావుగా ఏమి జరుగుతోందో
మంటలే మిగులుతుంది కొడకా
ప్రధానులు, మంత్రులు, నాయకులు, నవనాయకులూ
ఎగుడు దిగుడు రాస్తాల్లో ఎగిరిపడుతూ
తడబాటో తప్పటడుగో తలమునకలవుతూ
నిజాన్ని దాచనూ లేక
నిర్భయంగా చెప్పనూ లేక
సందిగ్ధంలో సతమతమవుతూ
తెలిసిందా మంటల్లో కాలుతున్న
నిజం ఎలా రాజుకుంటోందో
ఎక్కడ చూసినా మంటలే
పేదవాని గుండెల్లో మంటలే
పెద్దవాని మాటలో మంటలే
పోలీసు తుపాకీలో మంటలే
పౌరుడు వేసే ప్రతీ అడుగులో మంటలే
బస్సుల్లో మంటలే
బడుగు వర్గాల్లో మంటలే
ఆరని మంటలు
నిజంలా మండుతూనే ఉంటుంది
చల్లారాలంటే వేచి చూడాల్సిందే
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|