|
|
Articles: My Thoughts | మనసు లోతుల్లో.. - Mrs. haripriya haripriya
| |
మనసు కవిత మనసుకే పరిమితమనుకున్నా
కానీ నా కవిత ప్రకృతి అణువణువునా ప్రస్ఫుటమవుతోంది
వేకువనే సూర్య స్పర్శతో విరిసే ప్రతి పువ్వులో నా కవితే
పువ్వుల తాకి వీచే మలయమారుతంలో నా కవితే వినిపిస్తుంది
ఆకాశాన్నంటే శిఖరాగ్రాల నుంచి జాలువారే
హిమబిందువు నా కవితనాలపిస్తోంది
మబ్బుల్లో దాగి చుక్కలతో దాగుడుమూతలాడే
చందమామ కూడా నా కవిత వింటున్నాడు
మెరిసే ప్రతి తార నా కవితనే పలుకరిస్తోంది
ప్రకృతిలోని ప్రతి చిగురుటాకులో
నా కవితల కదలికలే కనిపిస్తున్నాయి
గలగల పారే సెలయేరు ప్రవహించే ప్రతి నదిలోనూ
ఎగసిపడే ప్రతి అలా నా కవితనే కోరుతున్నాయి
చెట్టు కొమ్మన చిలకమ్మ
చిగురుటాకుల ఊయల్లో కోయిలమ్మ
పూల పరిమళాన్ని దోచుకునే సీతాకోకమ్మ
నా కవితనే వినిపిస్తున్నాయి
ఇంతటి ప్రకృతి మాత
నా కవితల్ని ఒడి నింపుకున్న వేళ
నన్నెవరూ ఆదరించకపోయినా
అమ్మ ఆదరణ చాలన్న ఆనందం మిగిలిన వేళ
ధన్యనై అమ్మతోటి అనుభూతిని పంచుకుంటూ
కలకాలం ప్రకృతి వడిలో
నా కవితల్ని దాచుకుంటున్నా
ఈ తృప్తి చాలీజీవితానికి
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|