|
|
Articles: Poetry | ఉగ్రవాదంపై కన్నెర్ర - Site Administrator
| |
(జి. రమణయ్య)
ఒక సర్పం పడగవిప్పి
బుసలు కొడ్తూ విషం కక్కి
బీభత్సం సృష్టిస్తూ-
మారణహోమం సాగిస్తూంటే
నరనరాన పౌరుషాగ్ని ప్రజ్వలిస్తూంది!
అణువణువున రక్తాగ్ని రగులుకుంటోంది!
భారతీయుల ఏకాత్మ
ప్రళయజ్వాల కాకమానదు
సోదరా! ఇకనైనా నీ దుందుడుకుతనం మానుకో
దుష్టబుద్ధిని చంపుకో
ప్రేమగా కౌగలించుకో
ప్రపంచం మన కౌగిట్లో ఉంటుంది.
ఇక అందరం -
ఉగ్రవాదంపై కన్నెర్రజేద్దాం!
గుండెను నిలువునా కోసినా
దేహాన్ని ఖండఖండాలుగా నరికినా
చివరి రక్తపుబొట్టు వరకు
ఉగ్రవాదంపై పోరాడదాం!
జాతి మత కుల భేదాలు వీడి
సప్తస్వరాల ఏకరాగం ఆలపిద్దాం!
నా దేశం నా ప్రజలు
ఒకే ప్రాణం ఒకే ఆత్మ అని
ప్రపంచానికి నిరూపిద్దాం!
నా దేశం చాలా గొప్పది అని చాటుదాం!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|