|
|
Articles: My Thoughts | వాస్తు వాస్తవ పరిశీలన - Mr. Devender Chintala Devender
| |
ఇల్లు నిర్మాణంలో ప్రప్రథమంగా మనం చూసేది వాస్తు.
నిర్మాణం వాస్తుకనుకూలంగా ఉన్నదా అనేది చూసుకోవాలి. ప్రధానంగా స్థలం నలుచదరంగా ఉండాలి.
తూర్పున ముఖద్వారం ఉండాలనీ, ఆగ్నేయంలో వంటగదని, వాయవ్యంలో పిల్లల గది, లేదా అతిథిగది కేటాయించాలి. తూర్పు వాకిలి విశాలంగా ఉండాలి. ఉత్తరంలో స్థలం వదిలితే మంచిది.
ఇంటి నిర్మాణంలో ప్రధానంగా బావి లేదా బోరు వేయడం ఎక్కడ? అనేది చూసుకోవాలి. సహజంగా ఈశాన్య మూలలో నీటి వనరులని సమకూరుస్తారు. ఊళ్ళల్లోని పాత ఇళ్ళని పరిశీలిస్తే అర్థమైపోతుంది. అప్పుడందరూ ప్రశాంతంగా జీవించేవాళ్ళు. అదే ఇప్పుడు రోజంతా విపరీతమైన టెన్షన్ తో బ్రతుకీడుస్తున్నారు.
ఇలా ఎందుకు జరుగుతుంది అని ఒకసారి అవలోకనం చేసుకుంటే కొన్ని చిన్న విషయాలే మనకు సమాధానం చెప్తాయి.
ఆ రోజుల్లో పాత ఇళ్ళల్లో పైన చెప్పిన వాస్తుకనుగుణంగా ఇళ్ళు ఉండేవి కావు. కాని ప్రేమాభిమానాలుండేవి.
ఇంటికి వచ్చిన వ్యక్తిని అభిమానించి ఆదరించేవాళ్ళు. అన్నపానీయాలు సమకూర్చేవారు.
ఇప్పట్లా అందమైన ఇల్లు కట్టుకుని అందమైన గేటు వేసుకుని లోపల గదులన్నీ మూసుకుని పైగా గేటుకో కుక్క ఉన్నది జాగ్రత్త అంటూ బోర్డ్ తగిలించేసి ఉండేవారు కారు.
రోజూ ప్రతి ఇంట్లో పూజాపునస్కారాలు జరిగేవి. నిత్యదీపారాధన చేసేవారు. అందుకే ఆ ఇళ్ళు ఎప్పుడూ నిత్యకల్యాణం పచ్చతోరణంగా కళకళలాడేవి.
ప్రధానంగా ఇళ్ళల్లో ప్రశాంతత ఉండాలంటే ఇంటి యజమాని సరైన మంచి ప్రవర్తన కల్గి అందరి బాగోగుల గురించి ఆలోచన కల్గి ఉండాలి. ఇంటిల్లిపాది సభ్యులు సభ్యత కల్గి అతిథుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తే ఇంట్లో ఉన్న స్వల్పదోషాలు సైతం వాటి ఉనికిని
చల్లబర్చుకుంటాయనడంలో ఎలాంటి సంశయమూ లేదు.
తమకి తోచినంతలో వారానికో నెలకో అన్నదానం చేస్తే సమస్త దోషాలు హుష్ కాకి అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంట్లో మంచి జరగడం లేదని వాస్తు నిపుణుడ్ని తీసుకొచ్చి ఉన్న గోడల్ని, ద్వారబంధాల్ని పడగొట్టడం మాని దైవారాధన, నిత్యదీపారాధన, అన్నదానం లాంటి ధార్మిక క్రియల్ని సల్పితే ఇల్లు, ఇల్లాలు, ఇంటి యజమాని, ఇంటి సభ్యులు చుట్టుపక్కలవారు అందరూ హాయిగా వసిస్తారు.
ఎల్లరులకు శుభం!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|