|
|
Articles: Devotion | నారాయణ వందనం - Mr. venkataramayya putrevu
| |
పద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్షా!
కేశవ జనార్ధన చక్రపాణే!
దేవాది యోగీంద్ర సంస్తుత్య సద్భక్తచింతామణీ
లోకరక్షామణీ! రమాధీశా ఈశా!
నీ చరణకమలములకిదే వందనం అభివందనం!
బ్రహ్మపూజ్యంబైన భవదీయపాదాబ్జముల్ సేవించుచున్
మోక్షదాయకంబైన భవన్మంగళకీర్తనల్జేయుచున్
కొల్తుము నిన్ననన్యభక్తియుక్తులన్, యో!కమలనాభా
కమలాపతీ! విన్నపములివె నీకయ్యా విశ్వేశా!
కరుణతో మమ్మేలుమెప్పుడు కమలేశా!
నీ మనోజ్ఞ రూపమె మా యెడందలన్ హత్తుకొనిపోగా
మా సర్వాంగముల్ నీయందె వర్తింపగాజేసి
ఈ జన్మంబుననైన మరేజన్మంబుననైన సదా నిన్నె
కొల్చి తరింపగా నీదాసానుదాసుల మమున్
కటాక్షింపుమో కృపాకారుణ్య నిధానా కమలేక్షణా!
నీ సుభచరణాలకిదే వందనం అభివందనం!
శ్యామసుందరా నీ చరణసంసేవనంబె ముక్తిదాయకం
ధరణీసుతపాలా నీ దివ్యరూపావలో కనమె మంగళదాయకం
పుండరీకాక్షా నీ పతితపావన నామస్మరణం భవహరణం
దశరథనందనా దీనజనావనా దయతో మమ్మేలుమెప్పుడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|