|
|
Articles: Recipes | సేమ్యా రోల్స్ - Site Administrator
| |
కావలసిన పదార్థాలు :
ఉడికించిన బఠాణీలు : అర కప్పు
ఆలూ తురుము :రెండు కప్పులు
కారం : ఒక టీ స్పూన్
ఉప్పు : రుచికి సరిపడ
మైదాపిండి : రెండు టీ స్పూన్స్
సేమ్యా : ఒక కప్పు
కొత్తిమీర తరుగు :పావు కప్పు
ఉల్లి తరుగు : రెండు కప్పులు
నూనె : పావు కిలో
తయారు చేయు విధానం : ఉడికించిన బఠాణీలలో ఆలూ, ఉల్లి తరుగు, కొత్తిమీర వేసి కొద్దిగా నీటిని కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న రోల్స్‌గా చేసి వాటిని మైదాపిండిలో పొర్లించాలి. తర్వాత ఈ రోల్స్ ను సేమ్యాలో కూడా వేసి అటూ ఇటూ తిప్పి చుట్టూ బాగా సేమ్యా అంటుకునేటట్లు చూడాలి. తరువాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఈ రోల్స్ ను బాణలిలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. వీటిని టొమోటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|