నీ తల్లి పూతన కాదురా
విషముపాలు ఇవ్వలేదురా
కంసుని అంశలో పుట్టినావు
అమృతం తాగి నీవు
అమ్మ రొమ్ము చీల్చి
మాంసాహారం భోంచేస్తున్నావు
అన్నా...! అన్నా...
అన్నయ్యా...! అన్నా...
ఉగ్గుతో పెట్టిన
తెలుగు తియ్యదనం ఒక్కటేరా
మాటలు నేర్చిన మనిషివి నీవు
మృగంగా మారకురా
లేని పగలు పెంచుకొని
అమ్మనడ్డంగా నఱకకురా.