|
|
Articles: Devotion | కలవని ఇలలో... - Mrs. sujatha Thimmana
| |
కలవని ఇలలో
కలలే కన్నాను
అది నిజమని ఇపుడే
తెలుసుకున్నాను
తెలిసినదీ తలపులలో
దాచుకొనీ...
నీకై తపనల
తడబాటులో ఉన్నాను
తపము తాపమై
జీవము నిర్జీవమై
పోక మునుపే...
నీ కరుణల కొలనులోని
పన్నీటిని చిలికించుమయా...
శేషతల్పముపై నిదురించుచున్ననూ
నీ వంపు తిరిగిన పెదవులపై
చిరునగవులను చూడ
చింతలన్నీ మరచీ
ఇహలోక సౌఖ్యముల విడిచీ
శ్రీ వేంకటేశ్వ్వరా...!
ఆనందమానందమగునయా...
ఆత్మానందమగునయా...
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|