|
|
Articles: Poetry | హైతీ! - Prasadarao BVVHB Boggaram
| |
కన్నబిడ్డలు మాకు కనుమరుగయెనని
...కుందు పెద్దల సేద గూర్చునెవరు
ఆప్తమిత్రుడుపోయె నన్ని నాశనమయె
...నని యేడ్చు వారలకాప్తులెవరు
తాళి గట్టిన భర్త తనకిక లేడని
...తపియించు మగువ నోదార్చునెవరు
తల్లిదండ్రులు లేక తనకిక యెవరని
...విలపించు బాలుని పిల్చునెవరు
వారి - 'హైతీ'లనాదుకొను వారలెవరు
ఇదిగొ మేముంటిమనీ హామీ యిచ్చునెవరు
సర్వ లోకైక రక్షణ సత్ప్రభుండు
పరమ కరుణాంతరంగుడే వారి గాచు!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|