|
|
Articles: Poetry | ఎవరు నువ్వు..? - Mr. chaitanya prasad
| |
చిరుగాలిలా వస్తావు-
సెలయేటి గలగలలా మాట్లాడతావు
విరిసిన పువ్వుల్లా - నవ్వులు చిందిస్తావు
నా ప్రతి అడుగులో - అడుగు వేస్తున్నావు
ఊహల లోకంలో - విహరింపచేస్తున్నావు
అలుపెరుగని ప్రయాణం చేస్తున్న
నాలో ఆశలు చిగురింపచేస్తున్నావు
బ్రతుకు బాటలో పయనిస్తున్న నన్ను
జీవన గమనం వైపు మళ్ళిస్తున్నావు
ఆశ - నిరాసల మధ్య
అవిశ్రాంత పోరాటం చేస్తున్న నాలో
కొత్త ఊపిరి పోస్తున్నావు
ఎవరు నువ్వు..?
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|