|
|
Articles: Poetry | చిలుక పలుకులు - Site Administrator
| |
(సబ్బని లక్ష్మీనారాయణ)
తెలంగాణ ఇచ్చినా ఒకటే
తెలంగాణ ఇవ్వకున్నా ఒకటే
తెలంగాణ ఇచ్చినంతమాత్రాన
సమస్యలు పరిష్కారమవుతాయని
అభివృద్ధి జరిగిపోతుందని
పెద్దగా ఆశించవలసిందేమీ ఉండదు
ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి
ఎప్పుడైనా అభివృద్ధి చేయచ్చు!
ఇవి చిలుక పలుకులు!
కర్ర విరుగదు!
పాము చావదు!
మంత్రాలకు చింతకాయలు రాలవు
అరవై ఏళ్ళ నుండి అభివృద్ధి చేయలేదనే కదా!
చూసి చూసి వేరుపడదామనుకొంటున్నాం
మా పాలు మాకు
మా పాలన మాకు కావాలనుకొంటున్నాం!
సమైక్యాంధ్ర సహపంక్తి భోజనంలో
మాకు అందవలసినంత
సుదీర్ఘ అరవై ఏళ్ళ కాలంలో
అందలేదని చెందలేదనే కదా పోరాటం
గాంధీజీది స్వయంపాలన, స్వపరిపాలన పోరాటమే కదా!
అలానే తెలంగాణదీ పోరాటం!
ఇంకా చిలుక పలుకలెందుకు?
ఎటో ఒకటి కుండ బద్దలుకొట్టినట్లు చెప్పాలి
న్యాయం చెప్పాలి, సత్యం చెప్పాలి, ధర్మం చెప్పాలి
అవినీతి మీద పోరాటం అని చేసేవాళ్ళకు తెలియదా!
మరి తెలంగాణపై అవినీతిని ప్రదర్శించిన వాళ్ళను
ఖండిస్తూ... తెలంగాణకు స్వాగతం పలకాలి కదా!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|