|
|
Articles: Poetry | నానీలు - 61 - Miss kumari kumari
| |
బాధ్యతల ఊబిలో
'స్త్రీ' కి స్వేచ్ఛ..
'చేప'కు రెక్కలు
ఇచ్చిన ఏమి లాభం..
వారు కట్నం వద్దన్నారు..
ఆడబడుచు
పెళ్ళికి మాత్రం..
మా నాన్నే పెళ్ళిపెద్ద..
బెండకాయ ముచ్చులతో
పాదాల పారాణి..
మనసు నిండా..
పండిన నా బాల్యం..
నాటి స్త్రీ మూర్తి
ఇంటి ఇల్లాలే..
దేశానికిచ్చింది
ఎందరో ముద్దుబిడ్డలను..
అన్నప్రాసన్నాడు
'కందుకూరి' ము(ప)ట్టుకున్నది..
కచ్చితంగా
కుంకుమ భరిణే ..
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|