|
|
Articles: Recipes | స్వీట్ కార్న్ సమోస - Site Administrator
| |
కావలసిన పదార్థాలు :
స్వీట్ కార్న్ : ఒక కప్పు
పన్నీర్ : చిన్న కప్పు
కొత్తిమీర : ఒక కట్ట
గరం మసాల : ఒక టీ స్పూన్
అల్లం వెల్లుల్లి ఫేస్ట్ : ఒక టీ స్పూన్
ఉప్పు : రుచికి సరిపడ
మైదా : రెండు కప్పులు
నెయ్యి : రెండు టీ స్పూన్స్
నూనె : వేయించడానికి సరిపడ
తయారు చేయు విధానం : ముందుగా మైదా పిండిలో కొంచె వేడిచేసిన నూనె, సరిపడినంత ఉప్పు, నీళ్ళు వేసి కలిపి అరగంట సేపు నాననివ్వాలి. స్వీట్ కార్న్ ను ఉండకబెట్టు కొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. పన్నీర్, కొత్తిమీర ను విడివిడిగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉడకబెట్టిన స్వీట్ కార్న్ ను, కట్ చేసుకున్న పనీర్ ముక్కలను కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత గరం మసాలా, అల్లంవెల్లులి ఫేస్ట్ ను వేసి మరి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత కొత్తిమీరను వేయాలి. దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మైదా పిండిని మీడియం సైజు ముద్దలుగా చేసి చపాతీలా చేసుకోవాలి. మొత్తం అలా చేసుకున్న తర్వాత వాటిని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న చెపాతీలకు చుట్టూతా నెయ్యిని రాసి సమోసా ఆకారంలో మడుచుకోవాలి. దీనిలో స్వీట్ కార్న్ మిశ్రమాన్ని స్పూన్ తో కూరుకొని సమోసా విడిపోకుండా మడుచుకోవాలి. అన్నీ ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత సమోసాలను వేయించుకోవాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|