|
|
Articles: Short Stories | గ్రహణం - Site Administrator
| |
అంతా విన్నాక కళ్ళద్దాల్లోంచి, కాసేపు చందూని, అతని బట్టల్ని, ముఖ వర్చస్సుని పరిశీలించాడు. ఆ తర్వాత, రమ్య, రాజుల్ని జాగ్రత్తగా చూశాడు హెడ్మాస్టర్.
మీరెక్కడ పని చేస్తున్నారు? అడిగాడు హెడ్మాస్టర్.
చెప్పాడు చందు.
అచ్చమైన మధ్యతరగతి మనిషి. అందులోనూ కలెక్టెరాఫీసులో సీనియర్ సహాయకుడిగా పనిచేస్తున్న మనిషి ఎట్లా ఉంటాడో అలానే ఉన్నాడు చందు. అతని పిల్లలు కూడా ఇస్త్రీ చేసిన గుడ్డల్ని వేసుకొని, నీటుగా తలలు దువ్వుకొని ఉన్నారు.
ఈ స్కూల్లోనే వీళ్ళను ఎందుకు చేర్పించాలనుకుంటున్నారు? అడిగాడు
చందులో కొంచెం అసహనం చోటుచేసుకుంది. అయినా సహనంగానే `నా పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించాలనుకున్నాను కాబట్టి!' అన్నాడు దృఢంగా.
`ఈ స్కూలులో ఏం చదువు వస్తుందండీ! ఇక్కడ ఏడు తరగతులుంటే ముగ్గురు టీచర్లున్నారు... మీరు ఏమీ అనుకోను అంటే ఒక విషయం చెబుతాను... ఇక్కడికి దగ్గర్లో `గోల్డ్ బెల్స్' అనే ఇంగ్లీషు కాన్వెంటు స్కూలు ఉంది. అక్కడ చదువు బాగా చెప్తారు. నా కొడుకు లిద్దరూ అక్కడే చదువుకొంటున్నారు అన్నాడు హెడ్మాస్టరు'.
చందూకి సహనం పూర్తిగా చచ్చిపోయింది.... కోపం నషాళానికి అంటుతూ ఉంది. అయితే ఆ కోపాన్ని వీలైనంత వరకు వినయంలోనికి అనువాదం చేసుకొని,
`సార్! మా పిల్లల్ని ఉరవకొండలో పంచాయతీ ఎలిమెంటరీ స్కూల్లో చదివించాను. ఎందుకో తెలుసా... తెలుగు మీడియం కోసరం. నా కర్మ కొద్దీ ఇక్కడికి బదిలీ అయ్యిది. వచ్చాను. నాకు తెలిసినంతవరకూ ఏ దేశంలోనైనా పిల్లలు వాళ్ళ మాతృభాషలో చదువుకుంటేనే విషయాలను ఎంతో బాగా అర్థం చేసుకుంటారు. తర్వాతి కాలంలో ఏ భాషలోనైనా, ఏ విషయంలోనైనా రాణిస్తారు. మాతృభాష అంటే పిల్లలకు తల్లి పాల వంటిదండీ, అందుకే నా పిల్లల్ని తెలుగులోనే చదివిస్తాను' అన్నాడు చందు.
`పొరపాటు సార్! మీరు ఏ కాలం మాటలో మాట్లాడుతున్నారు. ఇప్పటి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. తెలుగుదేముందండీ! మనం మాట్లాడుకునే భాష. అది రాకుంటేనేం!' అన్నాడు తేలిగ్గా హెడ్మాస్టర్.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|