|
|
Articles: Short Stories | చదువూ సంస్కారం - Site Administrator
| |
ఆ మాటల్ని రాములమ్మ అందుకుని 'ఆగు ఆగు... ఆ, ఇందిరమ్మ ఇంట్లో నువ్వుండు. మీం రాము. ఆ యిల్లుకేటి? భూముంటుందా? ఆకాశముంటుందా? స్నానానికి గది (చాటు) ఉంటుందా?... చేతులు కడుక్కోవడానికి నీరుండదు... నువ్వు సారాయి సుక్కయినా ఇంటికి దెస్తావా... అక్కడే పేగులో బోసీసుకుని చేతులు దులిపీసుకోని, దరజాగా పారొస్తావు... నీకేటి? మగమహారాజువి?' అంది.
'ఓలోలె... రావుడూ... నీకీయేల ఏటి పట్టుకుందే... నేను తాగినానంతన్నావు, మూజూసి (మూతివాసన జూసి) చెప్మీ... నువ్వు గాని తాగీసినావేటియ్యేలా... లేకపోతే, ఇందిరమ్మ ఇల్లొస్తే ఎల్లనంతావేటి? 30 వేలిచ్చి గవర్నమెంటు కట్టించి, ఒట్టిగ పిలిచిస్తే కాలదన్నతన్నావేటే... చెప్మీ' అడిగాడు సీతప్పడు.
'ఎల్లనన్నాను గాని, ఒగిలేస్తానన్నానేటి? ఆ యిల్లు కూలిపోయి అందులో సమాదైపొమ్మంతావేటి?... అల్లాడు, సరుకులిచ్చే సావుకారు అడుగతున్నాడు... ఆ ముప్పయివేలు గాదు గాని 20 వేలు ఇచ్చేస్తాను... గ్రామపెద్దల దగ్గర నోటుమీద సంతకమెట్టీమంతన్నడు. ఆ డబ్బులు తీసికొని, చిన్న గుంటకి ముక్కూ చెవులూ కుట్టిద్దుం... దానికి రేపొద్దన్న మొగుడు రావాలా? మగ్గుంటలకి మొలతాడైనా లేదు. ఈ నలుగురుగుంటలకీ సదువులు చెప్పించాలా?... నీకూలీ, నా కూలీ డబ్బుల్తోటి కడుపులే నిండడం లేదు' అంది. మూకుడిలో తాలింపేస్తూ, చిటపటల మధ్య... పొయ్యిలో అగ్గిరాజేస్తూ...
'ఓల్నీయమ్మ కడుపుమాడా, ఇందిరమ్మలాగా ఎంత ఎమర్జన్సీగా ప్లాన్లు అల్లీసినావే...ఆఁ...' ఆశ్చర్యపోయాడు సీతప్పడు.
'శాన, శాన... పెద్దోడికి వంద, రెండోవాడికి 80, నడిపోడికి 70 కడతుంటే సరిపోతుంది... బొక్కలెట్టేస్తారని ప్రయివేటు బడిలో జాయినుచేస్సీనావు. మిగిలిన పనులెలాగ జరగతాయి? ఇంకా... ఈ చిన్నిగుంటను బడిలో ఎయ్యాలా? వద్దా?..' అంది రాములమ్మ. 'అటు ఇంగిలీసూ రాక, ఇటు తెలుగు ముక్కలు రాకా, మద్దిన సెడగొట్టినావు గుంటల్ని' అని గొణుక్కుంటున్న రాములమ్మనుద్దేశించి-
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|