|
|
Articles: My Thoughts | సంకల్ప విజయం - Site Administrator
| |
పుస్తకాలు చదవటమంటే అంత ఆసక్తి లేదు అనేవారు తమకిష్టమైన ఏదో ఒక పనిమీద మనసుబెట్టి చేసుకొంటుంటే నిరాశ నిస్పృహలు ఉండనే ఉండవు. ఈ మధ్యకాలంలో చీరల మీద వర్క్ చేయటం లాంటి పనులు వచ్చేయి. తమ పని తాము చేసుకొన్నామనే తృప్తి కాక... మరి కొందరికి నేర్పటం తయారుచేయటంతో ఆదాయమార్గాలు కూడా ఏర్పడుతున్నాయి కదా!
వెనుకటి రోజుల్లో ఎక్కువమంది స్త్రీలు కలిసినప్పుడు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకొనే వారనే అపప్రధ ఉండేది. అపుడు బయటకు వెళ్ళడం, నీళ్ళమోతలు వగయిరా ఉండేవి... ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎవరింట్లో వాళ్ళు టీవీకి అతుక్కుపోయి కూర్చుంటున్నారు. ఒకరితో ఒకరు మంచి చెడులు మాట్లాడుకోవడం తక్కువయింది. కనీసం ఇంట్లో ఇంట్లో వాళ్ళే కలిసి భోంచేయటం, ఒకరికొకరు చూసుకుంటూ కబుర్లాడుకొంటూ తినటం కాకుండా టీవీ వైపు చూస్తూ తింటం అలవాటయింది. పోనీ ఆ టీవీల్లో వచ్చే కార్యక్రమాల్లో తెలుసుకోదగ్గవాటిని చూస్తున్నామా అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి! సీరియల్స్ చూసినంత శ్రద్ధగా న్యూస్ చూస్తున్నామా! అని ప్రశ్నించుకోవాలి.
పని ఒత్తిడి అనేది ఎవరికయినా ఉంటుంది. స్త్రీ, పురుషుల్లో ఎవరికెక్కువ, ఎవరికి తక్కువ అని కాదు. ఈ రోజు స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. అటు ఇటు కూడా సమర్ధించుకొని చక్కగా చేస్తున్నారు. పురుషులు బయట విధులతో బాటు ఇంట్లోను సహాయపడేవారున్నారు. నేనే ఎక్కువ కష్టపడిపోతున్నానని, నా పనే కష్టతరమైందని అనుకొనే వారికి మాత్రం ఏ కోశాన ఓదార్పు ఉండదు. తమ మీద తామే జాలి పడటం మానేస్తే చాలా హాయిగా ఉంటుంది.
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|