ఆంధ్రాబ్యాంక్ లో అగ్నిప్రమాదం
ఏలూరు : జిల్లాలోని కొయ్యలగూడెంలోని ఆంధ్రాబ్యాంక్ లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ఏసీలు, ఒక కంప్యూటర్, పలు ఫైళ్ళు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ఈ అగ్నిప్రమాదానికి కారణం అని సమాచారం. సమచారం అందకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన బ్యాంకు వద్దకు తరలి వెళ్ళారు. మంటలను అదుపులోకి తెచ్చినట్లు పోలీసులు తెలిపారు.ఆంధ్రాబ్యాంక్ లో అగ్నిప్రమాదం
ఏలూరు : జిల్లాలోని కొయ్యలగూడెంలోని ఆంధ్రాబ్యాంక్ లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ఏసీలు, ఒక కంప్యూటర్, పలు ఫైళ్ళు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ఈ అగ్నిప్రమాదానికి కారణం అని సమాచారం. సమచారం అందకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన బ్యాంకు వద్దకు తరలి వెళ్ళారు. మంటలను అదుపులోకి తెచ్చినట్లు పోలీసులు తెలిపారు.
News Posted: 22 April, 2009
|