కాకినాడ : కెడిఆర్ ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ వైర్లకు మంటలు అంటుకోవడంతో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ బీచ్ రోడ్డులో ఉన్న కెడిఆర్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రొడక్షన్ వైర్లకు మంటలు అంటుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం.